దేశంలోని అన్నదాతల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. దీని కింద అన్నదాతలకు ప్రతీ సంవత్సరం ఆర్థిక సహాయం చేస్తుంది. ఏడాదికి 3 సార్లు ఆర్థిక సహాయాన్ని అందించి, పెట్టుబడికి కష్టాలను కొంతమేర తీర్చుతుంది. అయితే ఈ పథకంలో అర్హత లేని అన్నదాతలు ఎంతోమంది ఉన్నారంటూ, పలు నివేదికలు వెలవడ్డాయి. దీంతో ప్రభుత్వం త్వరలో అలాంటి వారకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.
- ఈమేరకు అర్హత లేని అన్నదాతలు పొందిన ఆర్థిక సహాయాన్ని తిరిగి ప్రభుత్వానికి అందించేలా ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అర్హత లేకుండా సహాయం పొందితే, కచ్చితంగా డబ్బును తిరిగి ఇవ్వాల్సిందేనని, లేదంటే మున్ముందు వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
- ఈమేరకు అన్నదాతలకే ఓ అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లోనే తగిని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు తెలుసుకునేందుకు పీఎం కిసాన్ వెబ్‌సైట్ https://pmkisan.gov.in/కి వెల్లి, చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌లో ‘రీఫండ్ ఆన్‌లైన్’ అనే ఆఫ్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి వివరాలను చెక్ చేసుకోవాలి.
- ఇందుకోసం బ్యాంక్ ఖాతా నంబర్, 12 అంకెల ఆధార్ నంబర్ లేదా ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు సబ్మిట్ చేశాక, ‘యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఏ రీఫండ్ అమౌంట్’ అనే మెసేజ్ కనిపిస్తే.. ఆర్తిక సహాయాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. అలాకాకుండా ‘రీఫండ్ అమౌంట్’ అనే ఆప్షన్ కనిపిస్తే ఆర్థిక సహాయాన్ని తప్పకుండా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈమేరకు త్వరలోనే ఓ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.