జమ్మూ కాశ్మీర్ లో తెలంగాణ బిడ్డ, సీఆర్‌పీఎఫ్ ఐజీగా చారు సిన్హా

| Edited By: Anil kumar poka

Sep 01, 2020 | 1:19 PM

ఉగ్రదాడులతో అట్టుడికే జమ్మూ కాశ్మీర్ లో తెలంగాణ బిడ్డ చారు సిన్హా  అత్యున్నత పదవిలో నియమితులయ్యారు. శ్రీనగర్ సెక్టార్ కి తొలి మహిళా ఐజీ అయ్యారు ఆమె.

జమ్మూ కాశ్మీర్ లో తెలంగాణ బిడ్డ, సీఆర్‌పీఎఫ్ ఐజీగా చారు సిన్హా
Follow us on

ఉగ్రదాడులతో అట్టుడికే జమ్మూ కాశ్మీర్ లో తెలంగాణ బిడ్డ చారు సిన్హా  అత్యున్నత పదవిలో నియమితులయ్యారు. శ్రీనగర్ సెక్టార్ కి తొలి మహిళా ఐజీ అయ్యారు ఆమె. ఈ సెక్టార్ సీ ఆర్ పీ ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ గా చారు సిన్హాను ప్రభుత్వం నియమించింది. తెలంగాణలో 1996 కేడర్ కి చెందిన ఈమె లోగడ బిహార్ సెక్టార్ ఐజీగా పనిచేశారు. ఆ రాష్ట్రంలో యాంటీ నక్సలైట్ కార్యకలాపాలను ఆమె పర్యవేక్షించారు. అనంతరం జమ్మూ ఐజీగా చాలాకాలంపాటు వ్యవహరించారు.  2005 లో  శ్రీనగర్ సెక్టార్ ప్రారంభమైనప్పటినుంచి ఇక్కడ ఐజీ స్థాయిలో మహిళా పోలీస్ ఆఫీసర్ ఎవరూ లేరు. జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిజం వ్యతిరేక కార్యకలాపాలను పర్యవేక్షించడంతో బాటు ఇండియన్ ఆర్మీతోను, జమ్మూ కాశ్మీర్ పోలీసులతోను చారు సిన్హా సమన్వయంగా పని చేయవలసిఉంటుంది.

ఈ సెక్టార్లో బడ్గామ్, గందర్ బల్, శ్రీనగర్ తో బాటు యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాఖ్ కూడా ఉండడం విశేషం.