Chandrayaan 3: చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధం.. ఇకపై ల్యాండింగ్‌లో నో ప్రాబ్లం.. కీలక టెస్ట్‌లో ఇస్రో సక్సెస్..

Mission Moon: చంద్రయాన్ 3 ప్రయోగంలో కీలకమైన పరీక్షలను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్‌ సమయంలో మునుపటి మిషన్ విఫలమైన తరువాత, దేశం మొత్తం ఇందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Chandrayaan 3: చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధం.. ఇకపై ల్యాండింగ్‌లో నో ప్రాబ్లం.. కీలక టెస్ట్‌లో ఇస్రో సక్సెస్..
Chandrayaan 3

Updated on: Feb 20, 2023 | 5:30 AM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో ) ఆదివారం చంద్రయాన్ -3 ల్యాండర్ ప్రధాన పరీక్ష, ఎలక్ట్రో-మాగ్నెటిక్ ఇంటర్‌ఫెరెన్స్/ఎలక్ట్రో-మాగ్నెటిక్ కాంపాటిబిలిటీ ( EMI /EMC) విజయవంతంగా పూర్తయిందని తెలిపింది. ఈ పరీక్ష జనవరి 31, ఫిబ్రవరి 2 మధ్య యూ.ఆర్. రావు శాటిలైట్ సెంటర్‌లో నిర్వహించారు. ఉపగ్రహ ఉప-వ్యవస్థల పనితీరు, అంతరిక్ష వాతావరణంలో ఆశించిన విద్యుదయస్కాంత స్థాయిలతో వాటి అనుకూలతను నిర్ధారించడానికి ఉపగ్రహ కార్యకలాపాల కోసం EMI/EMC పరీక్ష నిర్వహించామని ISRO తెలిపింది.

చంద్రయాన్-3 ల్యాండర్ EMI/EMC పరీక్ష సమయంలో, అవసరమైన అన్ని కార్యాచరణ పారామితులను పూర్తి చేసినట్లు ఇస్రో తెలిపింది. వ్యవస్థల పనితీరు సంతృప్తికరంగా ఉందని పేర్కొంది. చంద్రయాన్-2 తదుపరి మిషన్ ఇదే. 2019 సంవత్సరంలో చంద్రయాన్ -2 ద్వారా చంద్రుని ఉపరితలంపై రోవర్‌ను ల్యాండ్ చేయడానికి భారతదేశం చేసిన మొదటి ప్రయత్నం ఇది. అయితే, ఇది క్రాష్ అవ్వడంతో విఫలమైంది. జూన్‌లో చంద్రయాన్-3 ప్రయోగం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

చంద్రయాన్-3 అనేది చంద్రయాన్-2 మిషన్‌కు అనుసంధానంగా చేయనున్నారు. ఇది చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన ల్యాండింగ్, కక్ష్యలో ఎండ్-టు-ఎండ్ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. ల్యాండర్-రోవర్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. చివరి ప్రయోగ తేదీల గురించి భారత అంతరిక్ష సంస్థ ఇంకా ఏమీ చెప్పలేదు. ఇది 2023 రెండవ లేదా మూడవ త్రైమాసికంలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

చంద్రుని రహస్యాలు వెల్లడయ్యేనా..

మిషన్ లక్ష్యం చంద్రుని కూర్పును బాగా అర్థం చేసుకోవడం కోసం నిర్ధేశించారు. ఈ మిషన్ కోసం ఇస్రో మూడు ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకుంది. చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన, మృదువైన ల్యాండింగ్‌ను ప్రదర్శించడం, చంద్రునిపై రోవర్ కక్ష్య సామర్థ్యాలను ప్రదర్శించడం, దాని స్వంతంగా శాస్త్రీయ పరిశీలనలను నిర్వహించడం వంటివి ఇందులో ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..