ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2కు చివరి దశలో అంతరాయం ఏర్పడింది. చంద్రుడి ఉపరితలానికి 2.1కి.మీల దూరంలో ఉండగా.. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు. కొన్ని సంవత్సరాలుగా తాము పడ్డ కష్టం.. చివరిలో చేదు ఫలితాలను ఇచ్చిందని వారు ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు బెంగళూరులోని ఇస్రో సెంటర్ నుంచి శాస్త్రవేత్తలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ సైతం.. మీ కష్టాన్ని దేశమంతా చూసింది. ఇది పరాజయంగా భావించకండి.. మేమంతా మీ వెంటే ఉన్నాం అని పేర్కొన్నారు. అనంతరం ఆయన బయటకు వెళ్లే సమయంలో ఇస్రో ఛైర్మన్ కె.శివన్ మోదీ వెంట నడిచారు. ఈ ప్రయోగం విఫలం అవ్వడంపై తట్టుకోలేక పోయిన ఆయన కన్నీరు మున్నీరయ్యారు. దీంతో అక్కడే ఉన్న మోదీ ఆయనను వెన్ను తట్టి నిమిరి ఓదార్చారు. అయినా శివన్ తన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. కాగా చంద్రయాన్ 2 ప్రయోగంపై ఇప్పటికే భారత్ మొత్తం గర్విస్తోంది. మీరు విఫలమవ్వలేదు. ఇప్పటికే మమ్మల్ని గర్వపడేలా చేశారు అంటూ ఇస్రో శాస్త్రవేత్తలపై సామన్యుల నుంచి ప్రముఖులు ట్వీట్లు పెడుతున్నారు.
#WATCH PM Narendra Modi hugged and consoled ISRO Chief K Sivan after he(Sivan) broke down. #Chandrayaan2 pic.twitter.com/bytNChtqNK
— ANI (@ANI) September 7, 2019