AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T-2 Tigre: హమ్మయ్య.. ఎట్టకేటకు చిక్కింది.. మహారాష్ట్రలో నలుగురికి చంపిన బెబ్బులు ఇదే!

రెండ్రోజుల క్రితం మహారాష్ట్రాలోని చంద్రపూర్ జిల్లాలో తునికాకు సేకరణ కోసం వెళ్లిన కూలీపై దాడి చేసి నలుగురిని బలి తీసుకున్న పెద్దపులి ఎట్టకేటకు అటవీశాఖ అధికారులకు చిక్కింది.గత కొన్నాళ్లుగా సమీప గ్రామాల్లో సంచరిస్తూ జనాలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈ బెబ్బులిని ఐదు డ్రోన్, 20 ట్రాప్‌ కెమెరాల సహాయంతో గుర్తించి చివరకు బోణులో బంధించారు. దీంతో అందరూ ఊపిరిపీల్చకున్నారు.

T-2 Tigre: హమ్మయ్య.. ఎట్టకేటకు చిక్కింది.. మహారాష్ట్రలో నలుగురికి చంపిన బెబ్బులు ఇదే!
Chandrapur Tigress Captured
Naresh Gollana
| Edited By: |

Updated on: May 24, 2026 | 1:12 PM

Share

రక్తం మరిగి నలుగురి ప్రాణాలు బలితీసుకున్న బెబ్బులిని ఎట్టకేలకు పట్టుకున్నారు అటవీశాఖ అధికారులు. దాన్ని బోణులో బంధించి జూకు తరలించారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఈనెల 22 న శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో దారుణం ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిందేవాహి తాలూకా గుంజవాహి అటవీ ప్రాంతంలో తునికి ఆకులు తెంపుకుంటున్న మహిళా కూలీల గుంపుపై ఒక్కసారిగా పులి దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో గుంజవాహి అటవి ప్రాంతం ఆర్థనాదాలతో మారుమోగిపోయింది.

మే 22 ఉదయం 6 గంటల ప్రాంతంలో గుంజవాహికి చెందిన 20 మంది కూలీలు మూడు బృందాలుగా ఏర్పడి.. సిందేవాహి అటవి ప్రాంతంలో తునికి ఆకుల సేకరణ కు వెళ్లిన ఓ గుంపుపై ఒక్కసారిగా పులి దాడి చేసింది. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో దట్టమైన పొదల చాటునుంచి పులి ఒక్కసారిగా పంజా విసిరింది‌ కనురెప్ప మూసి తెరిచేలోపు నలుగురిపై పులి దాడి చేయడంతో.. ఆ మహిళలకు తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. ఈ మ్యాన్ హీటర్ దాడిలో నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా గంజేవాహి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ భయానక ఘటన చోటుచేసుకొంది.

ఒకే గ్రామానికి చెందిన నలుగురు మహిళలు మరణించారన్న వార్త తెలియగానే.. చుట్టుపక్కల గ్రామాలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే సిందేవాహి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంజలి సాయంకర్, పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులను శవపరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులను కవుదుబాయి దాదాజీ మొహర్లే (45), అనుబాయి దాదాజీ మొహర్లే, (40), సునీతా కౌశిక్‌ మొహర్లే (38), సంగీతా సంతోష్‌ (50)గా గుర్తించారు. వీరంతా గుంజేవాహి గ్రామానికి చెందినవారేనని అధికారులు తెలిపారు.

ఈ దారుణ ఘటన తర్వాత రంగంలోకి దిగిన మహారాష్ట్ర అటవిశాఖ.. దాడి చేసి టీ-2 అనే ఆడపులిగా గుర్తించింది. దీంతో దాన్ని పట్టుకునేందుకు ఆపరేషన్ మ్యాన్ ఈటర్‌ను చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా సిందేవాహి తాలూకా అటవి ప్రాంతంలో 5 డ్రోన్ కెమెరాలు 20 కి పైగా ట్రాప్ కెమెరాలతో సర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఎట్టకేలకు ట్రాప్ కెమెరాలకు చిక్కిన మ్యాన్ ఈటర్‌ను బోన్‌లు ఏర్పాటు చేసి..చాకచక్యంగా బంధించింది. దాన్ని అక్కడి నుంచి సిందేవాహి అటవి ప్రాంతంలోని పవన్‌పార్ ఫారెస్ట్ 282 కంపార్ట్మెంట్‌కు తరలించారు అధికారులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us