వామ్మో.. మాయదారి వైరస్‌ల స్వైర విహారం.. జనం గుండెల్లో భయం భయం..!

కరోనా వేరియంట్లతో పాటు వివిధ రకాల వ్యాధులు, వైరస్‌లు మనల్ని భయపెడుతూనే ఉన్నాయి. కరోనా వైరస్‌ పూర్తి కనుమరుగు కాకుండానే రోజుకో కొత్త వేరియంట్‌ రూపంలో దాపురిస్తున్నాయి. ఇప్పుడు మరో షాకింగ్ వార్త అందరిలోనూ మరిన్ని భయాలు క్రియేట్ చేస్తున్నాయి. నిన్ను వీడని నీడను నేనే.. అంటూ వరుస మాయదారి వైరస్‌లు..

వామ్మో.. మాయదారి వైరస్‌ల స్వైర విహారం.. జనం గుండెల్లో భయం భయం..!
Virus Fears In India

Edited By: Ravi Panangapalli

Updated on: Jul 26, 2024 | 9:29 AM

కరోనా.. ఈ పేరు వింటే చాలు జనం ఉలిక్కిపడుతున్నారు. ఒక్కసారిగా భయం ఆవహిస్తుంది. వెన్నులో వణుకు మొదలవుతుంది. ఆ మహమ్మారి సృష్టించిన విధ్వంసం అలాంటిది మరి. నాటి చేదు అనుభవాలు పీడకలగా మానవజాతిని వెంటాడుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారి మిగిల్చిన నష్టం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆ దేశం ఈ దేశం అని లేకుండా కరోనా మహమ్మారి దాదాపు అన్ని దేశాల్లో స్వైర విహారం చేసింది. కరోనా వైరస్ కొత్త రకం వేరియంట్లు ఇప్పటికీ వైలెంట్‌గా, డేంజరస్‌గా పంజా విసురుతూనే ఉన్నాయి. కరోనా వేరియంట్లతో పాటు వివిధ రకాల వ్యాధులు, వైరస్‌లు మనల్ని భయపెడుతూనే ఉన్నాయి. కరోనా వైరస్‌ పూర్తి కనుమరుగు కాకుండానే రోజుకో కొత్త వేరియంట్‌ రూపంలో దాపురిస్తున్నాయి. ఇప్పుడు మరో షాకింగ్ వార్త అందరిలోనూ మరిన్ని భయాలు క్రియేట్ చేస్తున్నాయి. నిన్ను వీడని నీడను నేనే.. అంటూ వరుస మాయదారి వైరస్‌లు బయటపడుతుండటంతో దేశంలో ఇప్పటికే మరో పాండమిక్ మొదలైపోయిందన్న అనుమానాలు భయపెడుతున్నాయి. ఒకటికాదు.. రెండుకాదు.. దాదాపు అర డజను వైరస్‌లు వదల బొమ్మాళీ వదలా అంటూ ఇండియాలోని పలు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. కొత్త వైరస్‌లు పలు రాష్ట్రాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కేరళలో నిఫా, మహరాష్ట్రలో జికా వైరస్‌, గుజరాత్‌, రాజస్థాన్‌లో చండీపురా వైరస్‌ మరణాలకు కారణమవుతున్నాయి. ఇప్పుడు ఈ మాయదారి వైరస్‌లను ఎదుర్కోవడం ఆయా రాష్ట్రాలతో పాటు యావత్ దేశానికి సవాలుగా మారుతోంది....

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి