Revenue Deficit Grant: జగన్ ప్రభుత్వానికి ఊరటనిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. భారీగా రెవెన్యూ లోటు భర్తీ నిధులు విడుదల

|

Sep 09, 2021 | 7:44 PM

Revenue Deficit Grant: రెవెన్యూ లోటు ఉన్న 17 రాష్ట్రాలకు నిధులను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది..  ఏకంగా రూ. 9,871 కోట్ల లను రిలీజ్ చేసింది కేంద్ర ఆర్ధిక శాఖ. ఇందులో భాగంగా ఆంధ్ర పదేశ్ కు..

Revenue Deficit Grant: జగన్ ప్రభుత్వానికి ఊరటనిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. భారీగా రెవెన్యూ లోటు భర్తీ నిధులు విడుదల
Revenue Deficit Grant
Follow us on

Revenue Deficit Grant: రెవెన్యూ లోటు ఉన్న 17 రాష్ట్రాలకు నిధులను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది..  ఏకంగా రూ. 9,871 కోట్ల లను రిలీజ్ చేసింది కేంద్ర ఆర్ధిక శాఖ. ఇందులో భాగంగా ఆంధ్ర పదేశ్ కు కేంద్రం ఏకంగా రూ. 1438 కోట్లను రిలీజ్ చేసింది. విభజన తర్వాత రెవెన్యూ లోటు లోకి వెళ్లిన ఆంధ్రపదేశ్ కు కరోనా కూడా తోడవ్వడంతో తీవ్ర ఆర్ధిక కష్టాలను ఎదుర్కొంటుంది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.1,438 కోట్లు రిలీజ్ చేయడం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఊరటనిచ్చినట్లు చెప్పవచ్చు. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరానిని ఏపీకి మొత్తంగా రూ.8,628.50 కోట్లను విడుదల చేశామని కేంద్రం ఆర్థిక శాఖ తెలిపింది.

ఇక  కేంద్ర విడుదల చేసిన ఆర్థిక సహాయం పై ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. గిరిజా శంకర్ స్పందించారు. 2021- 22 ఆర్ధిక సంవత్సరానికి 15 వ ఆర్థిక సంఘం మొదటి విడతగా రూ.581.70 కోట్లను కేంద్రం విడుదల చేసిందని చెప్పారు. ఈ నిధుల్లో 70% అంటే రూ. 407.19 కోట్లు గ్రామ పంచాయతీలకు, 15% అంటే రూ.174.51 కోట్లు జిల్లా పరిషత్ లకు 15% అంటే రూ.174.51 కోట్లు మండల పరిషత్ లకు జమ అయ్యిందని చెప్పారు.

లోటు ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ నిధులు కేటాయిస్తూ ఉంటుంది.  దీంతో 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు లోటు భర్తీకి నిధులు విడుదల చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్ర పన్నుల వాటా కాకుండా అదనంగా 2021 -22లో రూ.17,257 కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఈ మేరకు ఇప్పటికే రూ.8,628.50 రిలీజ్ చేసింది. ప్రస్తుతం కేంద్రం లోటు భర్తీ నిధులు విడుదల చేయడంతో ఏపీ ప్రభుత్వానికి కొంచెం రిలీఫ్ ఇచ్చినట్లు అయ్యింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇటీవల ఢిల్లీలోనే   ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ఉన్నతాధికారులందరినీ కలిశారు. ఈ క్రమంలో ఏపీ రుణ పరిమితిని పెంచుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఈ కారుణంగా రూ. 10500 కోట్లు డిసెంబర్ వరకూ అదనపు రుణం తీసుకోవడానికి అవకాశం లభించిందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.

Also Read: వినాయక చవితి జరుపుకుంటే చదువు వస్తుంది.. ఉత్సవాలకు అనుమతి ఇవ్వమని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఇద్దరు చిన్నారులు..