Rahul Gandhi: కరోనా వైరస్ రోజుకో రూపాన్ని సంతరించుకుంటూ.. మానవాళిని భ్రాయబ్రాంతులకు గురి చేస్తున్న వేళ.. మన దేశంలో మరొక ముందు అడుగు వేస్తూ.. అవసరమైనవారికి ముందుగా కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌లను ఇవ్వనున్నారు. ఈ విషయాన్నీ ప్రధాని మోడీ ప్రకటించారు. ఇదే విషయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ను ఇవ్వాలని తాను సూచించినట్లు .. ఇప్పుడు కేంద్ర తన ఆలోచనని అంగీకరించి అమలు చేస్తోందని రాహుల్ గాంధీ చెప్పారు. ఇది సరైన నిర్ణయం. వ్యాక్సిన్ల వల్ల వచ్చే రక్షణ ప్రతి ఒక్కరికీ చేరాలంటూ రాహుల్ ట్విటర్ వేదికగా తెలిపారు.
ఫ్రంట్ లైన్ వారియర్స్, 60 ఏళ్ల వయసు దాటి, ఇతర ఆరోగ్య సమస్యలున్నవారికి వైద్యుల సలహాపై బూస్టర్ డోసులను ఇవ్వనున్నమని ప్రధాని మోడీ శనివారం రాత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ఈరోజు రాహుల్ గాంధీ స్పందించారు.
అయితే రాహుల్ గాంధీ డిసెంబర్ 22న దేశంలో వ్యాక్సిన్ కార్యక్రమం నత్తనడక నడుస్తుందని.. సెంబరు నాటికి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యిందని కామెంట్ చేశారు. అంతేకాదు వ్యాక్సిన్ జరుగుతున్న తీరుని గణాంకాల రూపంలో వెల్లడించారు. ఇప్పటికీ దేశంలో వ్యాక్సిన్ చాలా మందికి అందలేదని చెప్పారు.. అంతేకాదు బూస్టర్ డోసులను ఎప్పటి నుంచి ఇవ్వడం మొదలు పెడతారంటూ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
Also Read: రామ భక్తుల కోసం ఐఆర్‌సీటిసీ సరికొత్త టూర్.. తక్కువ ఖర్చుతో అయోధ్యతో సహా పలు ప్రాంతాలు..