కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బాస్కెట్ బాల్ ఆడి సందడి చేశారు. శనివారం బెంగళూరు చేరుకున్న కేంద్ర మంత్రి, నేతాజీ సుభాష్ సౌత్ సెంటర్‌లో కొత్తగా నిర్మించిన పురుషుల హాస్టల్‌ను ప్రారంభించారు. అనంతరం అక్కడ కాసేపు బాస్కెట్ బాల్ ఆడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్రీడా రంగానికి ప్రోత్సాహాన్ని అందించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం పురుష క్రీడాకారులకు శిక్షణ అందించడంతో పాటు వసతి ఏర్పాట్ల కోసం ఈ హాస్టల్‌ను నిర్మించింది. క్రీడా రంగంలో భారత్‌ను ముందు వరుసలో నిలపాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం గురించి అంతకు ముందు కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. యువతకు క్రీడల పరిధి కేవలం పతకాలు సాధించడానికి మాత్రమే పరిమితం కాదన్నారు. యువ ఆటగాళ్లు ముందుకు సాగేందుకు ఇదొక ఒక వేదికను కూడా అందిస్తుందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.
#WATCH | Karnataka: Union Sports Minister Anurag Thakur plays basketball after the inauguration of the Men’s Hostel at Netaji Subhas Southern Centre, Bengaluru.
(Source: Sports Authority of India) pic.twitter.com/gaQCVZFbCP
— ANI (@ANI) December 23, 2023
ఇదిలా ఉంటే ఖేలో ఇండియా కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు తమిళనాడు, చెన్నై, కోయంబత్తూర్, మధురైతో పాటు తిరుచ్చి నగరాల్లో నిర్వహించనున్నారు. ఖేలో ఇండియా కార్యక్రమం అధికారిక ప్రకటన సందర్భంగా క్రీడా మంత్రి మాట్లాడుతూ.. ఖేలో ఇండియా యువ క్రీడలు కేవలం పతకాలు సాధించడానికే పరిమితం కాదన్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించేందుకు తమిళనాడు సిద్ధంగా ఉందన్నారు. ఇది కేవలం క్రీడాపోటీలే కాదు ఉద్యమంలా మారిందని అభివర్ణించారు.
ఇక ఖేలో ఇండియా ఈవెంట్‌లో మొత్తం 5630 మందికి పైగా క్రీడాకారులు పాల్గొననున్నారు. దేశంలో క్రీడా సంస్కృతిని నెలకొల్పడం, క్రీడల్లో రాణించడమే ప్రధాన లక్ష్యంగా ఖేలో ఇండియా కార్యక్రమాన్ని రూపొందించారు. క్రీడల ద్వారా పిల్లలు, యువతలో సమగ్ర అభివృద్ధి, సమాజ అభివృద్ధి, ఆరోగ్యకరమైన జీవనశైలిని నెలకొల్పడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. ఖేలో ఇండియా కార్యక్రమాన్ని 2018లో ప్రారంభించారు. ఇందులోభాగంగా ఎప్పటికప్పుడు వివిధ రాష్ట్రాల్లో వివిధ క్రీడలకు సంబంధించిన ఈవెంట్లను నిర్వహించి యువ క్రీడాకారుల ప్రతిభకు పదును పెడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..