
Central Minister: కేంద్ర మంత్రి సందానంద గౌడ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సందానంద గౌడను పరీక్షించిన వైద్యులు.. షుగర్ లెవెల్స్ పడిపోవడం వల్లే సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలిపారు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తతుం సదానందగౌడ ఆరోగ్యం బాగానే ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.
కాగా, ఇటీవలే సదానంద గౌడ కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజులు చికిత్స అనంతరం కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ క్రమంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలడంతో అంతా కంగారు పడ్డారు. కాగా, ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
Also read: