Telangana Formation Day: ధాన్యం కొనుగోలు చేస్తోంది కేంద్రం కాదా.. రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్‌ రెడ్డి ప్రశ్నలు..

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు గురువారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రం ఏర్పాటై 8 ఏళ్లు గడుస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా...

Telangana Formation Day: ధాన్యం కొనుగోలు చేస్తోంది కేంద్రం కాదా.. రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్‌ రెడ్డి ప్రశ్నలు..

Updated on: Jun 02, 2022 | 8:14 PM

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు గురువారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రం ఏర్పాటై 8 ఏళ్లు గడుస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరుకావడం విశేషం. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో నిర్వహించిన వేడుకలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, మీనాక్షిలేఖి హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.

ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో నెల రోజుల్లో ఫర్టిలైజర్స్‌ ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 1.40 లక్షల కోట్లు కేటాయించామని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందన్న కిషన్‌ రెడ్డి, కేసీఆర్‌కు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేశారని ప్రశ్నించారు. 8 ఏళ్లుగా ధాన్యం కొనుగోలు చేసింది కేంద్రం కాదా అని ప్రశ్నించిన కిషన్‌ రెడ్డి, తెలంగాణ అభివృద్ధికి కేంద్ర కట్టుబడి ఉందని కిషన్‌ స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..