హిందీభాష గొప్పతనం అది : కిషన్ రెడ్డి

|

Sep 14, 2020 | 8:54 PM

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో హిందీ భాష కీలక పాత్ర పోషించిందని కేంద్ర హోంశాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. భారతదేశంలో అనేక భాషలు మాట్లాడుతున్నప్పటికీ..

హిందీభాష గొప్పతనం అది : కిషన్ రెడ్డి
Follow us on

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో హిందీ భాష కీలక పాత్ర పోషించిందని కేంద్ర హోంశాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. భారతదేశంలో అనేక భాషలు మాట్లాడుతున్నప్పటికీ, హిందీ భాష సర్వవ్యాపకతను దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ నిర్మాతలు 14 సెప్టెంబర్ 1949న హిందీని జాతీయ భాషగా గుర్తించారని పేర్కొన్నారు. దేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో హిందీ భాషను ఎక్కువగా మట్లాడతారని, జాతీయభాష హోదా పొందినందున హిందీ ప్రాముఖ్యత మరింత పెరిగిందని ఆయన అన్నారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్‌ వరకు హిందీ భాష తెలిసిన వారు, మాట్లాడేవారు, అర్థం చేసుకునేవారు ఉండటం సంతోషకరమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హిందీ భాషను ఎక్కువగా వినియోగిస్తూ భాష గౌరవాన్ని పెంచుతున్నారని తెలిపారు. హిందీ భాషను సరళీకృతం చేయాల్సిన అంశాన్నీ ఆయన ప్రస్తావించారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సోమవారం నార్త్ బ్లాక్‌లో హిందీభాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు కిషన్ రెడ్డి, నిత్యానంద్ రాయ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాతోపాటు హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.