Masked Aadhar: మీరు మీ ఆధార్ కార్డ్(Aadhar Card) ఫోటోకాపీని (ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ) ఇప్పటి ఎవరితోనైనా షేర్ చేసినట్లైతే.. ఈ వార్త మీ కోసం మాత్రమే. ఆధార్ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనలో ఓ సలహా ఇచ్చింది. ఆధార్ కార్డ్ ఫోటోను ఎవరితోనూ పంచుకోవద్దని ప్రభుత్వం దేశ పౌరులకు విజ్ఞప్తి చేసింది. దీని వల్ల మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. మీ ఆధార్ కార్డ్ ఫోటోకాపీ దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి మీరు అవసరమైన చోట ఆధార్ కార్డ్ మాస్క్ ఫోటోకాపీని మాత్రమే షేర్ చేయాలి. అయితే.. ఆధార్ కార్డు అవసరం గురించి చెప్పాల్సిన పని లేదు. ఎక్కడపడితే అక్కడ దీని ఫొటోకాపీ (జిరాక్స్)ని ప్రూఫ్‌గా ఇచ్చేస్తున్నాం. వాటిని వారు ఎలా ఉపయోగిస్తారో కూడా ఆరా తీయడం లేదు. పని అయిపోయాక తిరిగి తీసుకుందామన్న అవగాహన చాలా మందిలో ఉండడం లేదు.
విచక్షణారహితంగా ఏ వ్యక్తి లేదా సంస్థతో తమ ఆధార్ ఫోటోకాపీలను పంచుకోవద్దని దేశప్రజలకు విజ్ఞప్తి చేసింది. UIDAI నుంచి వినియోగదారు లైసెన్స్ తీసుకున్న సంస్థలు ఏ వ్యక్తి గుర్తింపును స్థాపించడానికి ఆధార్‌ను ఉపయోగించవచ్చని మే 27న ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇహోటల్స్, సినిమాహాళ్ల వంటి ప్రదేశాల్లో ఆధార్‌కార్డు జిరాక్స్‌ను సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. యూఐడీఏఐ అనుమతి ఉన్న సంస్థలు మాత్రమే ఆధార్‌ను ధ్రువీకరణ కోసం ఉపయోగించుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.
ఈ 4 దశల్లో మాస్క్‌డ్ ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి, ముసుగు వేసిన ఆధార్ కార్డ్
12 అంకెల బదులు చివరి 4 అంకెలు మాత్రమే కనిపించి ఉండే ఆధార్ పత్రమే ఈ మాస్క్‌డ్ ఆధార్. దీనిపై మీ ఫొటో, క్యూఆర్ కోడ్, మీ చిరునామా ఇతర వివరాలు యథావిధిగా ఉంటాయి. ఎవరికైనా ఓ గుర్తింపు పత్రంలా ఆధార్ ఇవ్వాలనుకుంటే ఈ మాస్క్‌డ్ ఆధార్ ఉపయోగపడుతుంది. ఆధార్ నంబర్ పూర్తిగా అవసరం లేని చోట, ఇ-కేవైసీకి దీన్ని వినియోగించొచ్చు. బదులుగా ఇది చివరి 4 అంకెలను మాత్రమే చూపుతుంది. UIDAI వెబ్‌సైట్ నుండి ఆధార్ మాస్క్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Masked Aadhaar Card download: మాస్క్‌డ్ ఆధార్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి…