విద్యా సంస్థల ర్యాంకింగ్స్‌ విడుదల చేసిన కేంద్రం.. హైదరాబాద్‌ వర్సిటీ ఏ స్థానంలో ఉందంటే..

|

Jun 05, 2023 | 1:06 PM

కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్థలం ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. 2022కి గాను విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ-మద్రాస్ ఓవరాల్‌గా అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో ఐఐఎస్సీ-బెంగళూరు, ఐఐటీ-బాంబే, ఐఐటీ-ఢిల్లీలు నిలిచాయి. 10వ స్థానంలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీల ర్యాంకింగ్‌లో...

విద్యా సంస్థల ర్యాంకింగ్స్‌ విడుదల చేసిన కేంద్రం.. హైదరాబాద్‌ వర్సిటీ ఏ స్థానంలో ఉందంటే..
University Rankings
Follow us on

కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్థల ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. 2022కి గాను విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ-మద్రాస్ ఓవరాల్‌గా అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో ఐఐఎస్సీ-బెంగళూరు, ఐఐటీ-బాంబే, ఐఐటీ-ఢిల్లీలు నిలిచాయి. 10వ స్థానంలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీల ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలో ఐఐఎస్సీ-బెంగళూరు, రెండో స్థానంలో జేఎన్యూ-న్యూఢిల్లీ, మూడోస్థానంలో జామియా మిలియా యూనివర్సిటీ-న్యూఢిల్లీ నిలిచాయి. ఇక యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ 10వ స్థానం దక్కించుకుంది.

వరంగల్‌లోని నేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ 45వ స్థానంలో నిలవగా ఉస్మానియా యూనివర్సిటీ 46వ స్థానంలో ఉంది. ఇక యూనివర్సిటీల విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీకి 22వ స్థానం, ఆంధ్రా యూనివర్సిటీకి 36వ స్థానం దక్కింది. ఇంజనీరింగ్ విభాగం విషయానికొస్తే.. మొదటి స్థానంలో ఐఐటీ (మద్రాస్), 10వ స్థానంలో ఐఐటీ (హైదరాబాద్), 21వ స్థానంలో ఎన్ఐటీ (వరంగల్) నిలిచాయి. మేనేజ్మెంట్ విభాగంలో అగ్రస్థానంలో ఐఐఎం-అహ్మదాబాద్, రెండో స్థానంలో ఐఐఎం-బెంగళూరు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఫార్మసీ విభాగంలో మొదటి స్థానంలో జామియా హమ్‌దర్ద్ (న్యూఢిల్లీ), రెండోస్థానంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (హైదరాబాద్), ఆర్కిటెక్చర్ విభాగంలో మొదటి స్థానంలో ఐఐటీ-రూర్కీ, 7వ స్థానంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (విజయవాడ) నిలిచాయి.

లా విభాగంలో మొదటి స్థానంలో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (బెంగళూరు), 4వ స్థానంలో నల్సార్ యూనివర్సిటీ (హైదరాబాద్) ఉన్నాయి. డెంటల్ విభాగంలో సవీత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ (చెన్నై), రెండో స్థానంలో మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ (మణిపాల్)లు నిలిచాయి. వైద్య విద్య విభాగంలో మొదటిస్థానంలో ఎయిమ్స్ (న్యూఢిల్లీ), రెండోస్థానంలో PGIMER (చండీగఢ్), 3వ స్థానంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (వెళ్లూర్)లు ఉన్నాయి. విద్యా సంస్థల ర్యాంకింగ్స్ కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..