Lalu Prasad Yadav: చిక్కుల్లో లాలూ ప్రసాద్ యాదవ్.. ఉద్యోగాల కుంభకోణం కేసులో సీబీఐ విచారణకు అనుమతి..

|

Jan 14, 2023 | 7:04 AM

ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా మారారు. గతం తాలూకూ కేసులు ఇంకా ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై నమోదైన..

Lalu Prasad Yadav: చిక్కుల్లో లాలూ ప్రసాద్ యాదవ్.. ఉద్యోగాల కుంభకోణం కేసులో సీబీఐ విచారణకు అనుమతి..
Lalu Prasad Yadav
Follow us on

ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా మారారు. గతం తాలూకూ కేసులు ఇంకా ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై నమోదైన అభియోగాలపై విచారించేందుకు సీబీఐ రెడీ అయింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంది. ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారని ఆయనపై కేసులు ఉన్నాయి. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకునేందుకు.. కేంద్రం నుంచి ప్రాసిక్యూట్ అనుమతి తప్పనిసరని సీబీఐ అధికారులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న కేంద్రం సీబీఐ విచారణకు కేంద్రం అనుమతిచ్చింది.

2008-09 మధ్య రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరిగింది. అందులో కొన్ని అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగాలు ఇచ్చేందుకు లాలూ కుటుంబం అభ్యర్థుల నుంచి భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నారన్న వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. గతేడాది అక్టోబరు 7న లాలూతోపాటు ఆయన భార్య రబ్రీదేవి, మరో 14 మందిపై ఛార్జిషీటు దాఖలైంది. దీనిని ప్రత్యేక న్యాయస్థానం పెండింగ్‌లో ఉంది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రస్తుతం దాణా కుంభకోణానికి సంబంధించిన కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, అనారోగ్య కారణాలతో ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు.

ఇదిలా ఉండగా.. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి. ఈ కేసులోనూ దర్యాప్తును సీబీఐ ప్రారంభించింది. ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు ప్రత్యేక అధికారిగా పనిచేసిన భోళా యాదవ్‌ను సీబీఐ గతంలో అరెస్టు చేసింది. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ను విచారించేందుకు సీబీఐ అనుమతించడం హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.