CDS Bipin Rawat Death: హెలికాప్టర్‌ ప్రమాదంలో బిపిన్ రావత్ కన్నుమూత.. ఆయన భార్య కూడా మృతి

CDS Bipin Rawat Passes Away: ది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్... బిపిన్ రావత్ కన్నుమూశారు. తమిళనాడులోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది.

CDS Bipin Rawat Death: హెలికాప్టర్‌ ప్రమాదంలో బిపిన్ రావత్ కన్నుమూత.. ఆయన భార్య కూడా మృతి
Cds Bipin Rawat

Updated on: Dec 08, 2021 | 7:26 PM

Army chopper crash:హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్ రావత్ కన్నుమూశారు. ప్రమాదంలో బిపిన్ రావత్ కన్నుమూసినట్లు భారత వైమానిక దళం అధికారికంగా ధృవీకరించింది. హెలికాప్టర్‌ పైలెట్‌ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ 80 శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. తమిళనాడులోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులికతో పాటు మరో 11 మంది కన్నుమూశారు.  హెలికాప్టర్‌ కూలిన తరువాత మంటలు చెలరేగడంతో.. వీరంతా చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 14 మంది ఉన్నారు.

ఉదయం 11.50కి సూలూరు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ ఆర్మీ హెలికాప్టర్ బయలు దేరింది.  12.27కి కూనూరు దగ్గర హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది.  01.15కి ప్రధాని, రక్షణ మంత్రికి ఎయిర్‌పోర్స్ సమాచారమిచ్చింది.  01.30కి ప్రమాదాన్ని రక్షణ శాఖ ధృవీకరించింది. 03.00 గంటలకు కేబినెట్ అత్యవసర సమావేశం అయ్యింది.  03.15కి ఘటన వివరాలను రాజ్‌నాధ్ సింగ్ కేబినెట్‌కు వివరించారు. 03.45కి బిపిన్ రావత్ ఇంటికి వెళ్లి పరిస్థితిని వివరించారు రాజ్‌నాధ్ సింగ్.

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాలన్నీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్  కంట్రోల్‌లో ఉంటాయ్. దేశ రక్షణ వ్యవస్థలోనే సీడీఎస్ అత్యున్నత పదవి. అలాంటి అధికారి పయనిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని నీలగిరి కొండల్లో కుప్పకూలంది. ఆయనతోపాటు 14 మంది అఫీషియల్స్ వెళ్తోన్న హెలికాప్టర్ తునాతునలైంది.

కోయంబత్తూర్‌, కూనూరు మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారమందుకున్న ఆర్మీ, పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. కానీ అప్పటికే ఆ ప్రాంతమంతా కాలి బూడిదైంది. హెలికాప్టర్ క్రాష్ అవడంతో అందులో ఉన్న వారంతా మాంసపు ముద్దలుగా మారారు. హెలికాప్టర్‌లోని 14 మందిలో 13 మంది దుర్మరణం చెందారు.

బిపిన్ రావత్ మరణం పట్ల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రగాఢ సంతాపం తెలిపారు.

Also Read: వామ్మో.. ఈమె ఇక లైఫ్‌లో బర్త్ డే జరుపుకోదు.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం

నడిరోడ్డుపై స్కూల్ గర్ల్స్ ఫైట్.. గ్యాంగులుగా విడిపోయి మరీ.. ఆశ్చర్యపోయిన స్థానికులు