CBSE Exams: 2021 ఫిబ్రవరి/మార్చిలో సీబీఎస్ఈ పరీక్ష.. ఆఫ్‌లైన్‌లోనే పరీక్షలు.. ఆ ప్రచారాలను నమ్మోద్దండోయ్..

|

Dec 07, 2020 | 10:27 PM

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా సీబీఎస్ఈ పరీక్షలు ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తామని, ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవని ..

CBSE Exams: 2021 ఫిబ్రవరి/మార్చిలో సీబీఎస్ఈ పరీక్ష.. ఆఫ్‌లైన్‌లోనే పరీక్షలు.. ఆ ప్రచారాలను నమ్మోద్దండోయ్..
Follow us on

 

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా సీబీఎస్ఈ పరీక్షలు ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తామని, ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవని సీబీఎస్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సాన్యం భరద్వాజ్ తేల్చి చెప్పారు. కరోనా కారణంగా అందరూ ఆన్‌లైన్ పరీక్ష ఉంటుందని భావిస్తున్నారని, కానీ అలా జరగదని భరద్వాజ్ స్పష్టం చేశారు. ఎప్పటిలాగే పేపర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు దానికి అనుగుణంగా సిద్ధమవ్వాలని సూచించారు.

ఇదే విషయమై మీడియాతో మాట్లాడిన భరద్వాజ్.. పరీక్ష తేదీల ప్రకటనకు ఇప్పుడు సమయం కాదన్నారు. పరీక్ష తేదీల ప్రకటనకు ముందు ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చిస్తామని తెలిపారు. అయితే పరీక్షలను వాయిదా వేయాలనే ఆలోచన లేదన్నారు. వచ్చే సంవత్సరం(2021) ఫిబ్రవరిలో గానీ మార్చిలో గానీ పరీక్షను నిర్వహించనున్నట్లు స్పష్టంచేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని, విద్యార్థుల క్షేమం కోసం అన్ని రకాల చర్యలు చేపడతామని తెలిపారు.

అయితే కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుండి ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించాలనే డిమాండ్లు వస్తున్నాయని చెప్పిన ఆయన.. ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాత విధానంలోనే సీబీఎస్ఈ పరీక్ష జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు, ప్రచారాలను నమ్మొద్దని విద్యార్థులకు ఆయన సూచించారు.

కొద్ది రోజుల క్రితమే సీబీస్ఈ బోర్డు అధికారులు, విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌తో చర్చలు జరిపామని చెప్పి భరద్వాజ్.. టీచర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో చర్చల అనంతరమే పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిస్తామనే విషయాన్ని మంత్రి కూడా చెప్పారని గుర్తు చేశారు. స్వయంగా విద్యాశాఖ మంత్రి రమేష్.. డిసెంబర్ 10న ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సందేహాలను నివృత్తి చేస్తారని భరద్వాజ్ చెప్పుకొచ్చారు.