సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి, ఆమె తండ్రికి సీబీఐ సమన్లు జారీ చేసింది. తన కుమారుడు సూసైడ్ చేసుకునేలా అతడిని రియా ప్రోత్సహించిందని సుశాంత్ సింగ్ తండ్రి కేకే ఖాన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో రియాతో బాటు ఆమె తండ్రికి కూడా సీబీఐ అధికారులు సమన్లు పంపారు. మరోవైపు..సుశాంత్ లోగడ రెండు నెలలపాటు చికిత్స పొందిన హిందుజా ఆసుపత్రిని సీబీఐ లోని మరో బృందం నిన్న సందర్శించింది. అప్పడు సుశాంత్ ఎలా ప్రవర్తించాడు, అతనితో ఎవరున్నారు, ఆసుపత్రికి రియా వఛ్చి అతడిని పరామర్శించిందా, హాస్పిటల్ బిల్లు ఎవరు చెల్లించారు తదితర విషయాలపై కూడా వారు దర్యాప్తు ప్రారంభించారు.