చిదంబరం కేసులో.. 5 దేశాల సాయం కోరిన సీబీఐ.. కార్తీ పైనా ఉచ్చు ?

| Edited By:

Aug 24, 2019 | 12:07 PM

మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం కేసులో సీబీఐ అయిదు దేశాల సాయం కోరింది. ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో పదేళ్ల క్రితం ముడుపులను మళ్లించిన తీరును గుర్తించేందుకు, ఈ దేశాల్లోని డొల్ల (షెల్) కంపెనీల నుంచి సమాచారాన్ని, బ్యాంకు ఖాతాల వివరాలను ఈ దర్యాప్తు సంస్థ తెలుసుకోగోరింది. చిదంబరం ఆయన కుమారుడు కార్తీ కూడా ఈ యవ్వారంలో పాలుపంచుకున్నట్టు వార్తలు వచ్చాయి. బ్రిటన్, బెర్ముడా, స్విట్జర్లాండ్, మారిషస్, సింగపూర్ దేశాలకు లేఖలు రాసిన సీబీఐ.. […]

చిదంబరం కేసులో.. 5 దేశాల సాయం కోరిన సీబీఐ.. కార్తీ పైనా ఉచ్చు ?
Follow us on

మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం కేసులో సీబీఐ అయిదు దేశాల సాయం కోరింది. ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో పదేళ్ల క్రితం ముడుపులను మళ్లించిన తీరును గుర్తించేందుకు, ఈ దేశాల్లోని డొల్ల (షెల్) కంపెనీల నుంచి సమాచారాన్ని, బ్యాంకు ఖాతాల వివరాలను ఈ దర్యాప్తు సంస్థ తెలుసుకోగోరింది. చిదంబరం ఆయన కుమారుడు కార్తీ కూడా ఈ యవ్వారంలో పాలుపంచుకున్నట్టు వార్తలు వచ్చాయి. బ్రిటన్, బెర్ముడా, స్విట్జర్లాండ్, మారిషస్, సింగపూర్ దేశాలకు లేఖలు రాసిన సీబీఐ.. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు నడుం బిగించింది. ఐ ఎన్ ఎక్స్ మీడియా మాజీ బాస్ ఇంద్రాణి ముఖర్జీకి, ఆయన కొడుకు కార్తీకి ఈ డొల్ల సంస్థల నుంచి నిధులు అందాయన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. 2007 లో యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ. 305 కోట్ల విదేశీ నిధులను ఈ సంస్థకు మళ్లించడంలో ఈ తండ్రీ కొడుకులిద్దరిపై ఇలా పలు ఆరోపణలు వచ్చాయి. (ప్రస్తుతం చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్నారు). 5 దేశాలకు దర్యాప్తు సంస్థ లెటర్ రొగెటరీలను పంపిందంటే.. ఈ విషయంలో న్యాయపరమైన సహాయమేదైనా చేయాలని ఫారిన్ కోర్టును అభ్యర్థించినట్టే. గతంలో పలు మార్లు ఇలాంటి విజ్ఞప్తిని కోరిన సందర్భాలున్నాయి. ఫ్రాడ్ స్టర్ విజయ్ మాల్యా కేసులో ఇదే విధానాన్ని పాటించారు.

కస్టడీలో చిదంబరాన్ని ప్రశ్నించవలసిన అవసరం ఎంతైనా ఉందని సీబీఐ తరఫు న్యాయవాది, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ కేసులో చిదంబరం, ఆయన కొడుకు కార్తీకి, కొన్ని విదేశాల్లోని డొల్ల కంపెనీలకు మధ్య జరిగిన లావాదేవీలు బయటకు రావాలంటే ఇది తప్పనిసరి అని ఆయన అన్నారు. నిందితులు ఈ దేశంలోనూ, విదేశాల్లోనూ ఆస్తులు సంపాదించారనడానికి ఈడీ వద్ద తిరుగులేని సాక్ష్యాధారాలున్నాయని అన్నారు. ఈ దశలో ప్రాసిక్యూషన్, డిఫెన్స్ న్యాయవాదులకు, ఈయనకు మధ్య తీవ్ర
వాదోపవాదాలు జరిగాయి. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింగ్వి ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.
చిదంబరం అరెస్టు కాకుండా సుప్రీంకోర్టు తాత్కాలిక ఉత్తర్వులిచ్చి… ఈ కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అయితే స్పెషల్ సీబీఐ కోర్టు నిన్న జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించడంతో.. చిదంబరం ఇంకా సీబీఐ కష్టడీలోనే కొనసాగుతున్నారు.