డీకే.శివకుమార్ పన్ను ఎగవేత, డిటెయిల్స్ వెల్లడించిన ఐటీ శాఖ

| Edited By: Anil kumar poka

Oct 05, 2020 | 11:32 AM

కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డీకె.శివకుమార్ తన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఇన్ కమ్ టాక్స్ శాఖ తెలిపింది. మనీ లాండరింగ్ కేసులో గత ఏడాది ఈయనను ఈడీ అరెస్టు చేసి నాలుగురోజులపాటు విచారించిందని...

డీకే.శివకుమార్ పన్ను ఎగవేత,  డిటెయిల్స్ వెల్లడించిన ఐటీ శాఖ
Follow us on

కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డీకె.శివకుమార్ తన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఇన్ కమ్ టాక్స్ శాఖ తెలిపింది. మనీ లాండరింగ్ కేసులో గత ఏడాది ఈయనను ఈడీ అరెస్టు చేసి నాలుగురోజులపాటు విచారించిందని, 2017 లో ఈయన రూ. 8.6 కోట్ల ఆదాయాన్ని పన్నుల్లో చూపలేదని వెల్లడించింది. ఇది ఆ తరువాత 11 కోట్లకు పెరిగినట్టు పేర్కొంది. తాము దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పురస్కరించుకుని ఈడీ…. శివకుమార్ పై మనీలాండరింగ్ కేసు నమోదు చేసినట్టు ఐటీ శాఖ గుర్తు చేసింది. ఇలా ఉండగా ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి సీబీఐకి చెందిన పలు బృందాలు సోమవారం ఉదయం ఆరున్నర గంటల నుంచి శివకుమార్, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిపింది. కర్నాటకలో 9 చోట్ల, ఢిల్లీలో 4, ముంబైలో ఒకచోట మొత్తం 14 చోట్ల ఈ సోదాలు నిర్విరామంగా జరిగాయి.