Viral Video: గేదెల దొంగతనం కేసులో లంచం మేసిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌.. కరెన్సీ మింగేస్తుండగా వీడియో తీసిన స్థానికులు..

|

Dec 13, 2022 | 5:44 PM

గేదెల దొంగతనం ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా సబ్ ఇన్‌స్పెక్టర్ మహేంద్ర పాల్ పట్టుబడ్డాడు. విజిలెన్స్ బృందాన్ని గుర్తించిన సబ్ ఇన్‌స్పెక్టర్ డబ్బును మింగేందుకు ప్రయత్నించాడు. అయితే,..

Viral Video: గేదెల దొంగతనం కేసులో లంచం మేసిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌.. కరెన్సీ మింగేస్తుండగా వీడియో తీసిన స్థానికులు..
Swallows Currency Notes
Follow us on

ఇందుగలదు.. అందు లేదన్నట్టుగా ఎక్కడికెళ్లిన లంచం లేనిదే ఏ పనీ సాగని పరిస్థితి దేశంలో నెలకొంది. ఆఫీస్‌ బాయ్‌ నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ లంచం రుచిమరిగిన వారే ఉన్నారు. చివరకు ప్రజల్ని రక్షించాల్సిన పోలీసులు సైతం లంచాలకు అలవాటుపడిపోయారు. తాజాగా అలాంటిదే ఓ లంచగొండి పోలీస్‌ అధికారి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. లంచం తీసుకుంటూ పట్టుబడిన సదరు అధికారి ఆ తర్వాత ఏం చేశాడో వీడియోలో చూడొచ్చు. నిజంగా అతడు చేసిన పనితో నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. వీడియో చూస్తే మీరు కూడా అవాక్కవ్వాల్సిందే..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

హర్యానాలోని ఫరీదాబాద్‌లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఓ పోలీస్‌ అధికారి. ఫరీదాబాద్‌కు చెందిన ఒక పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో అతడు వెంటనే ఎవరూ ఊహించని పనిచేశా డు. తను తీసుకున్న లంచం డబ్బు..కరెన్సీ నోట్లను నోట్లో పెట్టుకుని గుటకాయ స్వాహా చేశాడు. అతడు నోట్లు మింగుతున్న వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన సోమవారం జరిగింది. గేదెల దొంగతనం ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా సబ్ ఇన్‌స్పెక్టర్ మహేంద్ర పాల్ పట్టుబడ్డాడు. విజిలెన్స్ బృందాన్ని గుర్తించిన సబ్ ఇన్‌స్పెక్టర్ డబ్బును మింగేందుకు ప్రయత్నించాడు. అయితే, అధికార బృందం పట్టుకుని అడ్డుకుంది. ఈ వీడియోను ఓ వీక్షకుడు తమ ఫోన్‌లో రికార్డ్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి