
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లాలోని వికాస్‌నగర్-సెలాకి ప్రాంతంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో కొందరు విద్యార్థులు స్కూల్ నుంచి తమ ఇళ్లకు నడిచి వెళ్తున్నారు. డెహ్రాడూన్-పావోంటా జాతీయ రహదారి నుంచి నిగమ్ రోడ్‌లోకి ఒక కారు వేగంగా వచ్చింది. వెనక నుంచి స్పీడ్‌గా వచ్చి నడిచి వెళ్తున్న స్కూల్ బాలికలపైకి దూసుకెళ్లింది. కారు ఢీకొట్టడంతో ఓ బాలిక గాలిలోకి ఎగిరిపడింది. దీంతో అదుపుతప్పిన ఆ కారు మరో మూడు వాహనాలను ఢీకొట్టి ఆగిపోయింది.
ఈ ప్రమాదంలో ఏడుగురు స్కూల్ విద్యార్థినుల సహా కారు డ్రైవర్, మరో బాలిక తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు ముగ్గురి విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ పోస్ట్ చూడండి…
उत्तराखंड में हवा में उड़ती गाड़ियों का आतंक कब खत्म होगा? सड़क सुरक्षा के दहशतगर्द लगातार बढ़ते जा रहे हैं। देहरादून में स्कूल से घर जा रही छात्राओं को एक आल्टो कार ने रौंद दिया। पुलिस ने मामला दर्ज किया है। CCTV आया सामने। 8 लोग अस्पताल में भर्ती
Video: Teena Sahu pic.twitter.com/LHuXkzJHih
— Ankit Sharma (@ankitsharmauk) April 24, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…