Cancelled Train List: రైల్వే ప్రయాణికులకు గమనిక.. వారం రోజులపాటు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలు రద్దు.. కారణం ఇదే

|

Nov 05, 2023 | 9:56 AM

భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ప్రయాణికులు ఈ కింద పూర్కొన్న రైలు రద్దులు, మళ్లింపులను గమనించవలసిందిగా ఆయన సూచించారు. గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌: గుంటూరు-విశాఖపట్నం (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌..

Cancelled Train List: రైల్వే ప్రయాణికులకు గమనిక.. వారం రోజులపాటు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలు రద్దు.. కారణం ఇదే
Cancelled Train List
Follow us on

విజయవాడ, నవంబర్‌ 5: భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ప్రయాణికులు ఈ కింద పూర్కొన్న రైలు రద్దులు, మళ్లింపులను గమనించవలసిందిగా ఆయన సూచించారు.

  • గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌: గుంటూరు-విశాఖపట్నం (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ నవంబర్‌ 6 నుంచి 12వ తేదీ వరకు రద్దు అవుతుంది
  • రాజమండ్రి-విశాఖపట్నం మెము స్పెషల్ ఎక్స్‌ప్రెస్: రాజమండ్రి నుండి విశాఖపట్నం (రైలు నెం. 07466) నవంబర్ 6 నుంచి నవంబర్ 12 వరకు రద్దు అవుతుంది.
  • విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం ఎక్స్‌ప్రెస్‌: విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం (07467) రైళ్ల సర్వీసులు నవంబర్ 6 నుంచి నవంబర్ 12 వరకు రద్దు చేయబడతాయి.
  • విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్: విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17240)ను నవంబర్‌ 7 నుంచి 13వ తేదీ వరకు రద్దు చేసినట్లు ప్రకటించారు.

దీపావళి స్పెషల్‌ రైళ్లు.. చెన్నై సెంట్రల్‌- భువనేశ్వర్‌ మధ్య ప్రత్యేక సర్వీసులు

ప్రతీయేట దీపావళి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుందనే విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది కూడా పండగ నేపథ్యంలో చెన్నై సెంట్రల్‌-భువనేశ్వర్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- భువనేశ్వర్‌ (06073) ప్రత్యేక రైలు నవంబర్‌13, 20, 27 తేదీల్లో నడుస్తుంది. ఈ ట్రైన్‌ రాత్రి 11.45 గంటలకు చెన్నైలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. ఆ తర్వాత 11.20గంటలకు బయలుదేరి వెళుతుందని తెలిపారు. తిరుగు ప్రయాణం ఇలా ఉంటుంది.. భువనేశ్వర్‌- చెన్నై సెంట్రల్‌ (06074) ప్రత్యేక రైలు నంబర్‌ 14, 21, 28 తేదీల్లో రాత్రి 9 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. ఇక్కడి నుంచి తిరిగి 3.50 గంటలకు బయలుదేరి వెళుతుందని అధికారులు తెలిపారు.

సూరత్‌-బ్రహ్మపుర మధ్య దీపావళి స్పెషల్‌ రైళ్లు..

సూరత్‌-బ్రహ్మపుర (09069) ప్రత్యేక రైలు నవంబర్‌ 8, 15, 22, 29 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ ట్రైన్‌ డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో మధ్యాహ్నం 2.20 గంటలకు సూరత్‌లో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.10 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 8.58 గంటలకు పెందుర్తికి చేరుకుంటుంది. తిరిగి తిరుగు బ్రహ్మపుర-సూరత్‌ (09070) ప్రత్యేక నవంబర్‌ 10, 17, 24 తేదీల్లో, అలాగే డిసెంబరు 1, 8, 15, 22, 29 తేదీల్లో తెల్లవారుజామున ఉదయం 3.30 గంటలకు బ్రహ్మపురలో బయలుదేరి ఉదయం 7.10 గంటలకు పెందుర్తికి, ఆ తర్వాత 8.20 గంటలకు దువ్వాడకు చేరుకుంటుందరని అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రయాణికులు ప్రత్యేక రైళ్ల సదుపాయాలను వినియోగించుకోవల్సిందిగా రైల్వే విభాగం సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.