పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ… ముస్లింలుగా మారిన క్రైస్తవులు..!

దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే పలుచోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారుతుండగా.. కేరళలో మాత్రం అందుకు భిన్నంగా నిరసనలు తెలిపారు. పతనంతిట్ట జిల్లా కోఝెన్చెర్రీలోని క్రైస్తవులు ముస్లిం వేశధారణలో చర్చిలో ప్రార్థనలు చేశారు. సెయింట్ థామస్ మర్ థోమా చర్చిలో.. కారొల్లెర్లు ముస్లిం సంప్రదాయాన్ని పాటిస్తూ.. తలకు టోపి పెట్టుకుని ప్రార్థనలు చేయడం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 23న క్రిస్మస్ కారోల్ నిర్వహిస్తున్న సమయంలో.. ఇలా సరికొత్తగా […]

పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ... ముస్లింలుగా మారిన క్రైస్తవులు..!

Edited By:

Updated on: Dec 28, 2019 | 6:25 PM

దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే పలుచోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారుతుండగా.. కేరళలో మాత్రం అందుకు భిన్నంగా నిరసనలు తెలిపారు. పతనంతిట్ట జిల్లా కోఝెన్చెర్రీలోని క్రైస్తవులు ముస్లిం వేశధారణలో చర్చిలో ప్రార్థనలు చేశారు. సెయింట్ థామస్ మర్ థోమా చర్చిలో.. కారొల్లెర్లు ముస్లిం సంప్రదాయాన్ని పాటిస్తూ.. తలకు టోపి పెట్టుకుని ప్రార్థనలు చేయడం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 23న క్రిస్మస్ కారోల్ నిర్వహిస్తున్న సమయంలో.. ఇలా సరికొత్తగా నిరసన తెలిపారు. మహిళా కారొల్లెర్లు కూడా తలకు హిజబ్ ధరించారు. సాధారణంగా ముస్లింలు ఇలాంటి ఆచారాలను పాటిస్తారు. అయితే క్రైస్తవులు వీటిని ధరించడం హాట్‌టాపిక్‌గా మారింది.

అంతేకాదు.. ముస్లింలు పాడే సంప్రదాయ పాటలైన “మప్పిల”ను కూడా ఈ సందర్భంగా పాడి వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తెచ్చిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. ముస్లింలకు మద్దతుగా ఇలా చేశారు. ఓ వైపు క్రైస్తవులు క్రిస్మస్ వేడుకల్ని జరుపుకుంటుంటే.. ముస్లింలు మాత్రం పౌరసత్వ చట్టం వల్ల ఇబ్బందులు పడుతున్నారనీ, వారి కష్టాల్ని ప్రపంచానికి తెలిపే ఉద్దేశంతోనే ఈ విధంగా నిరసనలు తెలిపినట్లు చర్చ్‌ నిర్వాహాకులు తెలిపారు.