Rajasthan : రాజస్థాన్‌లో బెడిసికొట్టిన బీజేపీ వ్యుహం.. ఉప ఎన్నికలో మంత్రిని ఓడగొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి

|

Jan 08, 2024 | 2:27 PM

రాజస్థాన్‌లో మంత్రి అయిన తర్వాత కూడా సురేంద్ర పాల్ సింగ్ కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. జనవరి 8న జరిగిన కౌంటింగ్‌లో 12,570 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి రూపిందర్ సింగ్ కూనర్‌ చేతిలో ఓటమిని చవిచూశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కొద్ది రోజుల క్రితం సురేంద్ర పాల్ సింగ్‌ను కేబినెట్ మంత్రిగా నియమించి నాలుగు మంత్రిత్వ శాఖలను కేటాయించడం విశేషం.

Rajasthan : రాజస్థాన్‌లో బెడిసికొట్టిన బీజేపీ వ్యుహం.. ఉప ఎన్నికలో మంత్రిని ఓడగొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి
Urendra Pal Singh Rupinder Singh Kooner
Follow us on

రాజస్థాన్‌లో మంత్రి అయిన తర్వాత కూడా సురేంద్ర పాల్ సింగ్ కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. జనవరి 8న జరిగిన కౌంటింగ్‌లో 12,570 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి రూపిందర్ సింగ్ కూనర్‌ చేతిలో ఓటమిని చవిచూశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కొద్ది రోజుల క్రితం సురేంద్ర పాల్ సింగ్‌ను కేబినెట్ మంత్రిగా నియమించి నాలుగు మంత్రిత్వ శాఖలను కేటాయించడం విశేషం.

రాజస్థాన్ చరిత్రలో తొలిసారిగా ఎన్నికలకు ముందు బీజేపీ అభ్యర్థిని మంత్రిగా నియమించింది. జనవరి 5న, ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ తన మంత్రివర్గాన్ని విస్తరించింది. కరణ్‌పూర్ బీజేపీ అభ్యర్థి సురేంద్ర పాల్ సింగ్‌ను స్వతంత్ర బాధ్యతతో రాష్ట్ర మంత్రిగా నియమించింది. ఆయనకు వ్యవసాయ మార్కెటింగ్, వ్యవసాయ సరుకుల శాఖ, నీటిపారుదల శాఖ, ఇందిరా గాంధీ కెనాల్, మైనారిటీ వ్యవహారాలు, వక్ఫ్ బోర్డుతో సహా నాలుగు శాఖలు ఇచ్చారు. అయితే కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికల్లో సురేంద్ర పాల్ సింగ్ విజయం సాధించలేకపోయారు.

కరణ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కున్నార్ మృతి చెందడంతో నవంబర్ 25న ఓటింగ్ జరగలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, ఎన్నికల సంఘం కరణ్‌పూర్ స్థానానికి జనవరి 5ని ఓటింగ్ తేదీగా నిర్ణయించింది. అయితే, దీనికి ముందు కూడా రాజస్థాన్‌లోని భజన్‌లాల్ శర్మ ప్రభుత్వంలో బీజేపీ తన కరణ్‌పూర్ అభ్యర్థి సురేంద్ర పాల్ సింగ్‌ను మంత్రిని చేసింది. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది.

ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలనే ఉద్దేశంతోనే కరణ్‌పూర్‌ అభ్యర్థిని బీజేపీ మంత్రిని చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. ఇది ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ పేర్కొంది. ఈ ఫిర్యాదుపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు కూడా వెళ్లింది. అదే సమయంలో ఇప్పటికే సురేంద్ర పాల్ సింగ్‌ను మంత్రిని చేశామని, ఈసారి కూడా మంత్రిని చేయడం కొత్త విషయం కాదని బీజేపీ చెబుతూనే ఉంది. అయితే, కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌కు ఆధిక్యం రావడంతో ఆ పార్టీ నేతలు బీజేపీపై మరింత విరుచుకుపడ్డారు.

కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానానికి మొత్తం 13 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది, ఒకరు ఉపసంహరించుకున్నారు. దీంతో 11 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి రూపిందర్ సింగ్ తన తండ్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ కూనర్ మరణం పట్ల సానుభూతి ఓట్లు పొందారు. దీంతో 12,570 ఓట్ల తేడాతో సురేంద్ర పాల్ సింగ్‌పై విజయం సాధించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…