Recharge Offers: మొబైల్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. టెలికం కంపెనీల పోటాపోటీ ఆఫర్లు

|

Apr 09, 2022 | 10:07 PM

Recharge Offers: ప్రస్తుతం టెలికం కంపెనీలు పోటాపోటీగా ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. పోటాపోటీగా రీచార్జ్‌ ప్లాన్స్‌ను ప్రకటిస్తున్నాయి

Recharge Offers: మొబైల్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. టెలికం కంపెనీల పోటాపోటీ ఆఫర్లు
Mobile Recharge Offers
Follow us on

Recharge Offers: ప్రస్తుతం టెలికం కంపెనీలు పోటాపోటీగా ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. పోటాపోటీగా రీచార్జ్‌ ప్లాన్స్‌ను ప్రకటిస్తున్నాయి ఆయా టెలికం కంపెనీలు. ఇక రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కొత్తగా నెల రోజుల పాటు వ్యాలిడిటీతో కొన్ని ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌ ను అందుబాటులోకి తెచ్చాయి. 30 రోజుల వ్యాలిడిటీ ఉండేలా కనీసం ఒక్క ప్లాన్‌ అయినా యూజర్లకు అందుబాటులో ఉండాలని ట్రాయ్‌ ఇటీవల టెలికం కంపెనీలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రియలన్స్‌ జియో కొత్తగా 259, 296 రూపాయల ప్లాన్స్‌ను తీసుకువచ్చింది. 259 రూపాయల ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకుంటే రోజుకు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 SMSలు చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌ క్యాలెండర్‌ మంత్‌ వ్యాలిడిటీతో ఉంటుంది. అయితే ఈ ప్లాన్‌లో ముందు ఏ తేదీన రీచార్జ్‌ చేసుకున్నారో.. తర్వాత అదే తేదీన రీచార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 296 రూపాయల ప్లాన్‌ తీసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీతో 2.5 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు చేసుకోవచ్చు.

ఇక ఎయిర్‌టెల్‌ ప్లాన్‌లో భాగంగా 319 రూపాయలు, 296 రూపాయల ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. 319 రూపాయల ప్లాన్‌ తీసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీతో 2.5 GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100SMSలు వినియోగించుకోవచ్చు. ఇక 296 రూపాయల ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకుంటే పూర్తి నెల రోజుల పాటు వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100SMSలు చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లతో ఎయిర్‌టెల్‌థ్యాంక్స్‌ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అలాగే వొడాఫోన్‌ ఐడియా కూడా కొత్తగా రీచార్జ్‌ ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో 327, 337 రూపాయల ప్లాన్స్‌ వున్నాయి. ఈ ప్లాన్‌లతో రీచార్జ్‌ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీతో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అలాగే 2.5GB డేటా వస్తుంది. ఈ ప్లాన్స్‌లో వీ మూవీస్‌, టీవీ ప్లాట్‌ ఫామ్‌లు ఉచితంగా పొందవచ్చు.

Also read:

Railway Recruitment 2022: నెలకు 25 వేలకు పైగా జీతం.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. పూర్తి వివరాలివే..

Vastu Tips: వాస్తు ప్రకారం ఈ దిశలో డబ్బులు అస్సలు పెట్టొద్దు.. పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి..!

Viral Video: బలవంతంగా ముద్దు పెట్టబోయిన ర్యాపర్‌.. సీన్ కట్ చేస్తే.. మీరే ఓ లుక్కేయండి..!