Budget Session 2023: బడ్జెట్ సమావేశాల్లో మళ్లీ సేమ్ సీన్ రిపీట్.. పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారానికి వాయిదా..

|

Mar 13, 2023 | 3:26 PM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల విదేశాల్లో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి ఖండిస్తూ లోక్​సభలో మాట్లాడారు. ఆయన ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు లోక్​సభలో వెల్​లోకి దూసుకెళ్లారు.

Budget Session 2023: బడ్జెట్ సమావేశాల్లో మళ్లీ సేమ్ సీన్ రిపీట్.. పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారానికి వాయిదా..
Budget Session
Follow us on

పార్లమెంట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. బడ్జెట్ సమావేశాల రెండో విడతలోనూ అదే తీరులో రచ్చ కనిపిస్తోంది. సభలో ఎంపీలు ఆందోళనలు చేయడం వల్ల లోక్​సభ మంగళవారంకు వాయిదా పడింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల విదేశాల్లో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి ఖండిస్తూ లోక్​సభలో మాట్లాడారు. ఆయన ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు లోక్​సభలో వెల్​లోకి దూసుకెళ్లారు. దీంతో సభను ముందుగా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓంబిర్లా. మరోవైపు, రాజ్యసభలోనూ అదే పరిస్థితి ఏర్పడింది. దీంతో పెద్దల సభ సైతం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అయితే మధ్యాహ్నం భోజన విరామం తర్వాత ప్రారంభమైన సమావేశాల్లో కూడా అదే గందరగోళం కొనసాగింది. దీంతో రెండు సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.

రెండో విడత బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​.. ఇటీవలే రాహుల్​ గాంధీ లండన్​లో జరిగిన ఓ సెమినార్​లో చేసిన కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యంపై రాహుల్​ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని రక్షణ మంత్రి కోరారు. లండన్​లో భారతదేశ పరువు తీశారని ఆయన ఆరోపించారు. ఈ సభలో సభ్యుడిగా ఉన్న రాహుల్ గాంధీ లండన్​లో భారత్​ను అవమానించారు. ఆయన వ్యాఖ్యలను ఈ సభలోని సభ్యులందరూ ఖండించాలి. రాహుల్​ సభా ముఖంగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నారని రక్షణ మంత్రి అన్నారు.

రాహుల్ దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని కోరారని ఆరోపించారు. రాజ్​నాథ్​ సింగ్​ చేసిన వ్యాఖ్యలకు అధికార పార్టీ సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో పాటుగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు. ప్రస్తుతం భారత్​లో ప్రజాస్వామ్యం బలంగా ఉందని.. మరింత బలపడుతుందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం