Budget 2022 Date: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ సమర్పణ

| Edited By: Team Veegam

Jan 14, 2022 | 1:29 PM

Parliament Budget 2022 session: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Budget 2022 Date: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ సమర్పణ
Parliament
Follow us on

Budget 2022 Parliament Session: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన నాలుగో బడ్జెట్‌ను వచ్చే నెల మొదటి తేదీన అంటే ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 వరకు జరుగుతాయని సమాచారం. కాగా రెండో దశ సెషన్ మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనుంది. ఈ ఏడాది బడ్జెట్‌లో సామాన్యులకు ఊరట లభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కరోనా నేఫథ్యంలో చిరు వ్యాపారులకు ఉద్దీపన ప్యాకేజీలు సైతం ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమై ఏప్రిల్ 8న ముగుస్తాయి. దేశంలో వేగంగా పెరుగుతున్న కరోనా ఇన్ఫెక్షన్ కేసుల మధ్య ఈ బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతుంది. గత కొన్ని రోజులుగా లోక్‌సభ మరియు రాజ్యసభ సెక్రటేరియట్‌లకు చెందిన వివిధ సర్వీసులకు చెందిన దాదాపు 400 మంది ఉద్యోగులు కోవిడ్ పాజిటివ్‌గా గుర్తించిన సమయంలో ఈ సెషన్ ప్రారంభమవుతుంది. జనవరి 4 మరియు జనవరి 8 మధ్య సాధారణ కోవిడ్ చెకప్‌లో రాజ్యసభ సెక్రటేరియట్‌లోని 65 మంది ఉద్యోగులు, 200 మంది లోక్‌సభ సెక్రటేరియట్ ఉద్యోగులు మరియు 133 మంది అనుబంధ సేవల ఉద్యోగులు సోకినట్లు సమాచారం అందజేసినట్లు వర్గాలు తెలిపాయి.