‘Made in China’ drone to India: పంజాబ్(Punjab)లోని అమృత్‌సర్(Amritsar) సెక్టార్‌లో పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్‌ను కూల్చివేసినట్లు సరిహద్దు భద్రతా దళం (BSF) వెల్లడించింది. బీఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అమృత్‌సర్ సెక్టార్‌లోని ధనో కలాన్ గ్రామ సమీపంలోని ప్రాంతంలో తెల్లవారుజామున 1.15 గంటల ప్రాంతంలో మేడిన్ చైనా డ్రోన్ భారత భూభాగంలోకి ప్రవేశించింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మోహరించిన BSF సిబ్బంది ఎగిరే వస్తువు శబ్దం విని, ప్రామాణిక ఆపరేటింగ్ విధానం ప్రకారం దానిని కాల్చివేశారు. ఆ ప్రాంతమంతా చుట్టుముట్టి పోలీసులు, ఇతర భద్రతా సంస్థలకు వెంటనే సమాచారం అందించారు.
ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. ఉదయం 6.15 గంటల ప్రాంతంలో ధనో కలాన్ గ్రామం సమీపంలో సెర్చ్ టీమ్ బ్లాక్ కలర్ ‘మేడ్ ఇన్ చైనా’ క్వాడ్‌కాప్టర్ (డ్రోన్), మోడల్ DJI మ్యాట్రిస్-300ని స్వాధీనం చేసుకుంది. దానిని కాల్చివేసినప్పుడు, క్వాడ్‌కాప్టర్‌లో పేలోడ్ లేదు. డ్రోన్‌లో పేలోడ్ ఉందా లేదా అని నిర్ధారించడానికి మొత్తం ప్రాంతాన్ని తిరిగి శోధించినట్లు BSF అధికారులు తెలిపారు
భారత్‌కు ఆయుధాలు, మాదక ద్రవ్యాలను రవాణా చేయడానికి పాకిస్తాన్‌లోని భారత వ్యతిరేక శక్తులు డ్రోన్‌లను ఉపయోగిస్తున్నాయి. పంజాబ్ సరిహద్దులో హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలను రవాణా చేయడానికి డ్రోన్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని, జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలు డ్రోన్‌ను కూల్చివేసిన తర్వాత ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని సీనియర్ BSF అధికారులు తెలిపారు.
Read Also…. Mana Uru Mana Badi: జూన్ 1 నుంచి బడి బాట.. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సర్కార్ బడులుః మంత్రి సబితా