పాకిస్తాన్ నుంచి ఆయుధాలు, డ్రగ్స్, దొంగరవాణాకు బ్రేక్

| Edited By: Pardhasaradhi Peri

Sep 20, 2020 | 3:42 PM

పాకిస్తాన్ నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్ ఇండియాకు స్మగుల్ అవుతుండగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు పసిగట్టి వాటిని స్వాధీనం చేసుకున్నాయి. జమ్మూలోని ఆర్నియా ప్రాంతంలో..

పాకిస్తాన్ నుంచి ఆయుధాలు, డ్రగ్స్, దొంగరవాణాకు బ్రేక్
Follow us on

పాకిస్తాన్ నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్ ఇండియాకు స్మగుల్ అవుతుండగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు పసిగట్టి వాటిని స్వాధీనం చేసుకున్నాయి. జమ్మూలోని ఆర్నియా ప్రాంతంలో పాక్ అంతర్జాతీయ సరిహద్దు నుంచి ఇవి ఆదివారం తెల్లవారుజామున ఇవి స్మగుల్ అవుతున్నాయి. కంచె ఉన్న ప్రాంతంలో ముగ్గురు, నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడడంతో,  సరిహద్దు భద్రతా దళాలు కాల్పులు జరపడంతో వారు పారిపోయారు. ఘటనా స్థలం నుంచి 58 పాకెట్ల డ్రగ్స్,రెండు పిస్టల్స్,ఇతర మందుగుండు సామాగ్రిని బీఎస్ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ నెల 14-15 తేదీల్లో సాంబా ఇంటర్నేషనల్ బోర్డర్ ద్వారా కాశ్మీర్ లోకి చొరబడడానికి యత్నించిన పాక్ ఉగ్రవాదుల ఆగడాన్ని జవాన్లు అడ్డుకున్నారు. వారిపై కాల్పులకు దిగడంతో వారు పారిపోయినట్టు తెలుస్తోంది.