కడుపులో కత్తితో పొడిచి.. వేళ్లు నరికేసి.. లా స్టూడెంట్‌పై దారుణంగా దాడి..

కాన్పూర్‌లో మందుల ధర విషయంలో జరిగిన చిన్న గొడవ చివరకు ప్రాణాంతక దాడిగా మారింది. మెడికల్ షాపులో లా విద్యార్థి అభిజీత్ సింగ్‌కు, షాపు యజమాని అమర్ సింగ్‌కు మధ్య మాటామాటా పెరిగింది. అమర్ సింగ్‌కు అతని సోదరుడు విజయ్ సింగ్‌తో పాటు మరో ఇద్దరితో కలిసి అభిజీత్‌పై దారుణంగా దాడి చేశారు. కత్తితో కడుపులో పొడిచి, వేళ్లు నరికేశారు..

కడుపులో కత్తితో పొడిచి.. వేళ్లు నరికేసి.. లా స్టూడెంట్‌పై దారుణంగా దాడి..
Law Student Stabbed In Kanpur

Updated on: Oct 27, 2025 | 9:58 AM

ప్రస్తుతం సమాజంలో హిాంస పెరిగిపోతుంది. చిన్న గొడవలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. మందుల ధర విషయంలో మెడికల్ షాపు యజమానికి, లా విద్యార్థికి మధ్య జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది. దుకాణం యజమాని విద్యార్థి కడుపును కోసి, చేతి వేళ్లను నరికేసిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. కాన్పూర్ యూనివర్సిటీలో ఫస్టీయర్ చదువుతున్న లా విద్యార్థి అభిజీత్ సింగ్ చందేల్ స్థానిక మెడికల్ షాప్‌కు వెళ్లాడు. అక్కడ మందుల ధర గురించి అభిజీత్‌కు, షాపులో పనిచేసే అమర్ సింగ్ అనే వ్యక్తికి మధ్య మాటామాటా పెరిగింది. ఈ చిన్న వాదన కొద్దిసేపటికే పెద్ద ఘర్షణగా మారింది.

కత్తితో దారుణంగా దాడి

అమర్ సింగ్‌కు మద్దతుగా అతని సోదరుడు విజయ్ సింగ్‌తో పాటు ప్రిన్స్ రాజ్ శ్రీవాస్తవ, నిఖిల్ కూడా చేరారు. ఈ నలుగురు కలిసి అభిజీత్ సింగ్‌పై అత్యంత దారుణంగా దాడి చేశారు. దుండగులు మొదట విద్యార్థి తలపై బలంగా కొట్టడంతో అతను నేలపై పడిపోయాడు. ఆ తర్వాత వారు అభిజీత్ కడుపుపై దాడి చేసి, పదునైన వస్తువుతో కోసినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన అభిజీత్ అరుస్తూ తన ఇంటి వైపు పరిగెత్తగా, దుండగులు అతన్ని మళ్లీ పట్టుకున్నారు.

ఈ దాడిలో వారు అభిజీత్ చేతిలోని రెండు వేళ్లను నరికివేసినట్లు పోలీసులు ధృవీకరించారు. అభిజీత్ అరుపులు విని స్థానికులు పరిగెత్తుకుంటూ రావడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే అభిజీత్‌ను స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. దాడిలో విద్యార్థి తలపై 14 కుట్లు పడ్డాయని, అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెడికల్ షాపు యజమానితో పాటు మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us