AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“సాకులు చెప్పి తప్పించుకోలేరు.. భరణం చెల్లించాల్సిందే”.. ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు!

కేవలం నిరుద్యోగం లేదా ఇతర బాధ్యతలను సాకుగా చూపి, చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యకు, మైనర్ కుమారుడికి ఆర్థిక మద్దతు ఇచ్చే బాధ్యత నుండి భర్త తప్పించుకోలేడని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. గృహ హింస కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ, తన కొడుకు పోషణ కోసం నెలకు రూ. 6,000 భరణం చెల్లించాలని సదరు వ్యక్తిని కోర్టు ఆదేశించింది.

సాకులు చెప్పి తప్పించుకోలేరు.. భరణం చెల్లించాల్సిందే.. ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు!
Court
Balaraju Goud
|

Updated on: Jun 06, 2026 | 9:32 PM

Share

కేవలం నిరుద్యోగం లేదా ఇతర బాధ్యతలను సాకుగా చూపి, చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యకు, మైనర్ కుమారుడికి ఆర్థిక మద్దతు ఇచ్చే బాధ్యత నుండి భర్త తప్పించుకోలేడని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. గృహ హింస కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ, తన కొడుకు పోషణ కోసం నెలకు రూ. 6,000 భరణం చెల్లించాలని సదరు వ్యక్తిని కోర్టు ఆదేశించింది.

గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం (PWDV) కింద ఆర్థిక సహాయాన్ని నిరాకరిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన అప్పీలును అదనపు సెషన్స్ జడ్జి శీతల్ చౌదరి ప్రధాన్ విచారించారు. జడ్జి ఆ మహిళ అప్పీలును అనుమతిస్తూ ఈ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

బాధిత మహిళకు 2013 ఫిబ్రవరిలో వివాహం జరిగింది. పెళ్లయిన నాటి నుండి భర్త, అత్తమామలు వరకట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా వేధించారని ఆమె ఆరోపించింది. తాను గర్భవతిగా ఉన్న సమయంలోనే ఇంటి నుండి బయటకు గెంటేశారని, నాటి నుండి అంటే 2015 నుంచి తన కుమారుడితో కలిసి ఒంటరిగా నివసిస్తున్నట్లు పేర్కొంది. మధ్యలో ఒకసారి ఫ్యామిలీ కోర్టులో రాజీ కుదిరినప్పటికీ, కొద్ది నెలలకే మళ్లీ విడిపోయారు.

గతంలో సెప్టెంబర్ 2025లో దిగువ కోర్టు గృహ హింస ఆరోపణలను నిరూపించడంలో మహిళ విఫలమైందంటూ ఆమె ఫిర్యాదును కొట్టివేసింది. అయితే, శారీరక దాడికి వైద్య రికార్డులు లేవన్న దిగువ కోర్టు వాదనతో అప్పీలేట్ కోర్టు అంగీకరించినప్పటికీ.. 2015 నుండి తండ్రి బిడ్డకు ఎలాంటి ఆర్థిక సహాయం అందించలేదనే నిజాన్ని నిర్ధారించింది.

భార్య చదువుకున్నదనే కారణంతో భరణాన్ని నిరాకరించలేమని కోర్టు స్పష్టం చేసింది. సంపాదించే సామర్థ్యం ఉండటం వేరు, నిజంగా సంపాదించడం వేరని న్యాయమూర్తి పేర్కొన్నారు. భర్త ఆరోగ్యవంతుడైన పురుషుడని, బిడ్డ సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులపై సమానంగా ఉంటుందని కోర్టు గుర్తుచేసింది. “నా అభిప్రాయం ప్రకారం, భర్త నెలకు రూ. 6,000 భరణం చెల్లించగల సామర్థ్యం కలిగి ఉన్నారు. ఈ ఉత్తర్వు వచ్చిన తేదీ నుండి సదరు మైనర్ కుమారుడు మేజర్ (18 ఏళ్లు) అయ్యేంత వరకు ప్రతి నెల ఈ మొత్తాన్ని తప్పనిసరిగా చెల్లించాలి” అని కోర్టు ఆదేశించింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల