‘ బ్రదర్ సెంగార్ కష్టాల్లో ఉన్నాడు….. బీజేపీ ఎమ్మెల్యే ‘ ఏడుపు ‘ !

|

Aug 03, 2019 | 2:33 PM

ఉన్నావ్ రేప్ కేసు నిందితుడు, ప్రస్తుతం జైల్లో ఉన్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కి మద్దతుగా వ్యాఖ్యలు చేశాడు ఇదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ఆశిష్ సింగ్ ఆషు. యూపీలోని హర్దోయ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయన.. సెంగార్ కష్టాల్లో ఉన్నాడని, తన సహచరుడైన ఆయన జైలు నుంచి ఎప్పుడు విడుదల అవుతాడా అని చూస్తున్నానని అన్నాడు. ఉన్నావ్ సమీపంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆశిష్ సింగ్.. ‘ మన […]

 బ్రదర్ సెంగార్ కష్టాల్లో ఉన్నాడు..... బీజేపీ ఎమ్మెల్యే  ఏడుపు  !
Follow us on

ఉన్నావ్ రేప్ కేసు నిందితుడు, ప్రస్తుతం జైల్లో ఉన్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కి మద్దతుగా వ్యాఖ్యలు చేశాడు ఇదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ఆశిష్ సింగ్ ఆషు. యూపీలోని హర్దోయ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయన.. సెంగార్ కష్టాల్లో ఉన్నాడని, తన సహచరుడైన ఆయన జైలు నుంచి ఎప్పుడు విడుదల అవుతాడా అని చూస్తున్నానని అన్నాడు. ఉన్నావ్ సమీపంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆశిష్ సింగ్.. ‘ మన సోదరుడు కుల్దీప్ సింగ్ సెంగార్ ఈ రోజున మనమధ్య లేడని, ఎన్నో కష్టాలు పడుతున్నాడని ‘ వ్యాఖ్యానించాడు. సెంగార్ తన ఇబ్బందులు, సమస్యల నుంచి త్వరలో బయటపడి మన మధ్యకు వస్తాడని ఆశిస్తున్నానని ఆయన చెప్పాడు. ‘ మేం ఎక్కడ ఉన్నా.. అతని క్షేమాన్ని కాంక్షిస్తాం.. అతని శ్రేయోభిలాషులమే ‘.. అని ఈయన పేర్కొన్నాడు. ఓ వైపు ఢిల్లీలో ప్రధాని మోదీ సహా.బీజేపీ అధిష్టానం ఇలాంటి ‘ నోటి దురుసు ‘ నేతలకు చెక్ చెప్పేందుకు శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తుంటే.. మరోవైపు.. ఆశిష్ సింగ్ వంటి నేతలు ఓ రేపిస్టు ముద్ర పడిన నిందితుడికి మద్దతుగా మాట్లాడడం విశేషం. .