మనోడు మహాముదురు..! గుట్టు చప్పుడు కాకుండా ఇంటి పైభాగంలో చాటుమాటు యవ్వారం.. కట్ చేస్తే..

|

Apr 12, 2024 | 4:05 PM

ఇంటి బంగ్లాపై పూల మొక్కల నడుమ గంజాయి మొక్కలు కూడా గుట్టు చప్పుడు కాకుండా సాగుచేస్తూ ఓ విదేశీయుడు పట్టుబడ్డాడు. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) గోవాలోని సోకోరోలోని సదరు వ్యక్తి ఇంటిపై దాడి చేశారు. సోదాల్లో అతని ఇంట్లో 33 గంజాయి మొక్కలు, 10 గ్రాముల గంజాయితోపాటు రూ. 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు..

మనోడు మహాముదురు..! గుట్టు చప్పుడు కాకుండా ఇంటి పైభాగంలో చాటుమాటు యవ్వారం.. కట్ చేస్తే..
Man Grows Cannabis On Terrace
Follow us on

గోవా, ఏప్రిల్‌ 12: ఇంటి బంగ్లాపై పూల మొక్కల నడుమ గంజాయి మొక్కలు కూడా గుట్టు చప్పుడు కాకుండా సాగుచేస్తూ ఓ విదేశీయుడు పట్టుబడ్డాడు. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) గోవాలోని సోకోరోలోని సదరు వ్యక్తి ఇంటిపై దాడి చేశారు. సోదాల్లో అతని ఇంట్లో 33 గంజాయి మొక్కలు, 10 గ్రాముల గంజాయితోపాటు రూ. 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిని బ్రిటన్‌కు చెందిన జేసన్‌గా గుర్తించారు. జేసన్‌ ఉత్తర గోవాలోని సొకారోలో నివాసం ఉంటున్నాడు. అతడు తన ఇంటిపై భాగంలో ఇతర పూల మొక్కల మధ్యలో పూల కుండీల్లో గంజాయి సాగుచేస్తున్నాడని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (NCB)కి పక్కా సమాచారం అందింది. దీంతో ఎన్‌సీబీ అధికారులు అతని ఇంటిపై దాడిచేసి సోదాలు నిర్వహించారు. టెర్రస్‌పై ఇతర మొక్కలతోపాటు పూల కుండీల్లో గంజాయి సాగుచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అతనిపై కేసు నమోదుచేసి జేసన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

కాగా జేసన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు ఎన్సీబీ అధికారులు అతడిని అరెస్టు చేశారు. 2022, నవంబర్‌ 28న అతనివద్ద 107 ఎక్స్‌టసీ ట్యాబ్లెట్లు, 40 గ్రాముల ఎండీఎంఏ పౌడర్‌తోపాటు 55 గ్రాముల చరాస్‌, వివిధ రకాల మాదక ద్రవాలను స్వాధీనం చేసుకున్నారు. కొంత కాలం జైలు జీవితం అనుభవించిన అతను.. బెయిల్‌పై బయటికి వచ్చాడు. అయినప్పటికీ అతని బుద్ధి మారలేదు. పాత బాటపడ్టిన నిందితుడు ఇప్పుడు ఏకంగా తన ఇంట్లోనే గంజాయి సాగు చేస్తూ అధకారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.