Johnson-Modi Meet: నేడు ప్రధాని మోడీ, బ్రిటన్ ప్రధానిల భేటీ.. తాము రష్యా.. భారత్‌ల ప్రత్యేక బంధాన్ని అర్ధం చేసుకున్నామన్న బోరిస్

|

Apr 22, 2022 | 9:33 AM

Johnson-Modi Meet: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (Britain PM Boris Johnson) నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) తో భేటీ కానున్నారు. ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీలో (Delhi) ప్రధాని మోడీ..

Johnson-Modi Meet: నేడు ప్రధాని మోడీ, బ్రిటన్ ప్రధానిల భేటీ.. తాము రష్యా.. భారత్‌ల ప్రత్యేక బంధాన్ని అర్ధం చేసుకున్నామన్న బోరిస్
Boris Johnson And Narendra
Follow us on

Johnson-Modi Meet: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (Britain PM Boris Johnson) నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) తో భేటీ కానున్నారు. ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీలో (Delhi) ప్రధాని మోడీ తో జాన్సన్ భేటీ కానున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం తొలిసారిగా భారత్ కు వచ్చిన ప్రధాని జాన్సన్ గురువారం గుజరాత్ లోని అహ్మదాబాద్ చేరుకున్నారు.  బోరిస్‌ జాన్సన్‌కు ఘనస్వాగతం లభించింది. గుజరాతీ సాంప్రదాయ నృత్యాలతో ఆయనకు స్వాగతం పలికారు. గాంధీనగర్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు బోరిస్‌ జాన్సన్‌. ప్రపంచశాంతికి గాంధీజీ చేసిన సేవలను కొనియాడారు. చరఖా తిప్పారు. గాంధీనగర్‌లోని స్వామినారాయణ శాఖకు చెందిన ప్రసిద్ధ అక్షరధామ్ దేవాలయాన్ని సందర్శించారు.  ఆ తరువాత పంచమహల్‌లో జేసీబీ ఫ్యాక్టరీని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా బుల్‌డోజర్‌ పాలిటిక్స్‌ ఊపందుకున్న వేళ సాక్షాత్తూ బ్రిటన్‌ ప్రధాని బుల్‌డోజర్‌ను నడపడం అందరి దృష్టిని ఆకర్షించింది. జాన్సన్‌ బుల్‌డోజర్‌ నడిపిన దృశ్యం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఆతిథ్యాన్ని స్వీకరించారు బోరిస్‌ జాన్సన్‌. బ్రిటన్‌ కంపెనీలతో రక్షణ, ఎయిర్‌ స్పేస్‌ రంగాలతో తాము కలిసి పనిచేస్తునట్టు చెప్పారు అదానీ. నిజానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జూన్సన్ గంటలోనే భారత్ లో పర్యటించాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో జాన్సన్ పర్యటన రెండు సార్లు వాయిదా పడింది.

ఈక్రమంలోనే గురువారం జాన్సన్ తొలిసారిగా భారత్ లో అడుగు పెట్టారు. ఈ పర్యటనలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి  ఇరు దేశాల ప్రధానులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు, ఇరు దేశాల ఆర్ధిక నిపుణులు సూచన మేరకు ‘న్యూ ఏజ్ ట్రేడ్ డీల్’ పై  దృష్టి సారించనున్నారు. వీటన్నింటితో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా నేటి భేటీలో కీలకంగా మారనుంది. అయితే ఇప్పటికే జాన్సన్ .. భారత్ రష్యా మధ్య మైత్రి తాము అర్ధం చేసుకున్నామని చెప్పిన నేపథ్యంలో ఈ సమావేశంలో  రష్యా సంక్షోభం పై ప్రధాని మోడీతో, జాన్సన్ పాక్షిక చర్చలే జరుపుతారని తెలుస్తుంది.

ఇక ఇరు దేశాల మధ్య ఉత్పత్తి, సేవల రంగం , పెట్టుబడులు, మేధో సంపత్తి హక్కులు, జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI ట్యాగ్) వంటి అంశాలపై కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని సమాచారం. రక్షణ రంగంలో ఆయుధాల సేకరణ, ముడిసరుకుల సరఫరా సహా దేశీయంగా ఫైటర్ జెట్స్ ను తయారు చేసుకునేలా బ్రిటన్ భారత్ తో ఒప్పందం కుదుర్చుకోనుంది.

బ్రిటన్ ప్రధాని బోరిస్ ను ఉక్రెయిన్‌పై భారత్ వైఖరి గురించి అడిగినప్పుడు.. తమ దేశం ఇప్పటికే మోడీతో దౌత్య స్థాయిలో ఉక్రెయిన్ యుద్ధ సమస్యను లేవనెత్తిందని చెప్పారు. ఇప్పటి వరకు భారత్ ఈ విషయంలో తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. అంతేకాదు భారతదేశం, రష్యాల మధ్య “చారిత్రాత్మకంగా చాలా భిన్నమైన స్నేహ సంబంధాలు ఉన్నాయని”  తాము అర్థం చేసుకున్నామని జాన్సన్  చెప్పారు. బ్రిట‌న్‌లో బిలియ‌న్ పౌండ్ల పెట్టుబ‌డుల‌తో 11,000 ఉద్యోగాలు అందుబాటులోకి వ‌స్తాయ‌ని వివరించారు. 5జీ టెలికాం నుంచి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, వైద్యారోగ్య రంగంలో ప‌రిశోధ‌న‌ల వ‌ర‌కూ ప‌లు రంగాల్లో ఇరు దేశాలు క‌లిసి ప‌నిచేస్తూ పురోగ‌తి సాధిస్తాయ‌న్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛ వాణిజ్యంపై అందరికి అవకాశం కల్పించేలా భారత్, బ్రిటన్ దేశాలు అనుకూలంగా ఉన్నాయి.

Also Read: AP Crime: అడ్డుగా ఉన్నాడని సైనైడ్ తాగించింది.. ఆత్మహత్యగా చిత్రీకరించేలా నాటకమాడింది.. చివరికి

Heat wave: నిప్పులు చిమ్ముతున్న భానుడు.. ఎండల తీవ్రత నేపథ్యంలో వృద్ధులు, పిల్లలకు వాతావరణ శాఖ అలెర్ట్

Jammu Encounter: జమ్మూలో ఉగ్రవాదుల కాల్పులు.. ఒక జవాన్ మృతి..నలుగురికి గాయాలు.. కొనసాగుతున్న కూంబింగ్