దుర్గామాత చేతిలో ‘కరోనా వైరస్ హతం’, కాంగ్రెస్ నేత శశిథరూర్ ఫిదా

| Edited By: Pardhasaradhi Peri

Oct 19, 2020 | 5:37 PM

పశ్చిమబెంగాల్ లో ఈ నెల 22 నుంచి వైభవంగా ఐదు రోజులపాటు దుర్గామాత ఉత్సవాలు నిర్వహించనున్నారు. అనేక చోట్ల పందిళ్ళలో దుర్గాదేవి ప్రతిమలను.,విగ్రహాలను ఏర్పాటు చేశారు. కోల్ కతా లో దుర్గాపూజా కమిటీ ఆధ్వర్యాన నెలకొల్పిన ఓ పందిరిలో ‘కోవిడ్-19 థీమ్’ తో ఓ ప్రతిమను ఏర్పాటు చేయడం కాంగ్రెస్ నేత శశిథరూర్ ని ఎంతగానో ఆకర్షించింది. తన ఖడ్గంతో దుర్గామాత  కరోనా వైరస్ ‘రాక్షసుడిని’ అంతమొందిస్తున్నటుగా ఉంది ఆ ప్రతిమ.. దీనిపై థరూర్..’బ్రిలియంట్ అప్రోప్రియేట్’ అని […]

దుర్గామాత చేతిలో కరోనా వైరస్ హతం, కాంగ్రెస్ నేత శశిథరూర్ ఫిదా
Follow us on

పశ్చిమబెంగాల్ లో ఈ నెల 22 నుంచి వైభవంగా ఐదు రోజులపాటు దుర్గామాత ఉత్సవాలు నిర్వహించనున్నారు. అనేక చోట్ల పందిళ్ళలో దుర్గాదేవి ప్రతిమలను.,విగ్రహాలను ఏర్పాటు చేశారు. కోల్ కతా లో దుర్గాపూజా కమిటీ ఆధ్వర్యాన నెలకొల్పిన ఓ పందిరిలో ‘కోవిడ్-19 థీమ్’ తో ఓ ప్రతిమను ఏర్పాటు చేయడం కాంగ్రెస్ నేత శశిథరూర్ ని ఎంతగానో ఆకర్షించింది. తన ఖడ్గంతో దుర్గామాత  కరోనా వైరస్ ‘రాక్షసుడిని’ అంతమొందిస్తున్నటుగా ఉంది ఆ ప్రతిమ.. దీనిపై థరూర్..’బ్రిలియంట్ అప్రోప్రియేట్’ అని ట్వీట్ చేశారు. ఆ అజ్ఞాత శిల్పి, డిజైనర్ ఎవరో గానీ వారికి నా శాల్యూట్ అని ట్వీటించారు.

కాగా-కరోనా వైరస్ నేపథ్యంలో బెంగాల్ లో దుర్గాపూజా పందిళ్లను విజిటర్లకు నో ఎంట్రీ జోన్లుగా కలకత్తా హైకోర్టు ప్రకటించింది. కేవలం నిర్వాహకులను మాత్రమే అనుమతించాలని సూచించింది. దేశంలో కరోనా వైరస్ కేసులు సుమారు 75 లక్షలు దాటాయి.