
పుణే జిల్లాలో విషాదకర ఘటన వెలుగుచూసింది. ఇంద్రాయణి నదిపై ఉన్న పురాతన బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో పలువురు పర్యాటకులు గల్లంతైనట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఆదివారం కుండమాల ప్రాంతంలో చోటుచేసుకుంది. వర్షాకాలంలో పర్యాటకులతో కిటకిటలాడే ఈ ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
#WATCH | Pune, Maharashtra | A bridge collapsed on the Indrayani River, near Kundamala village, under the Pimpri-Chinchwad Police station. 10 to 15 people feared trapped. 5 to 6 people have been rescued. More details awaited: Pimpri Chinchwad Police https://t.co/CiYAnNDiyS pic.twitter.com/g0jm7QE9Xv
— ANI (@ANI) June 15, 2025
మావల్ తాలూకాలోని కుందమల ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. వర్షాకాలంలో ప్రతిరోజూ వందలాది మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. కుందమల చేరుకోవడానికి ఇంద్రాయణి నదిపై ఒక పురాతన వంతెన ఉంది. అది అకస్మాత్తుగా కూలిపోవడంతో.. వంతెనపై ఉన్న 10 నుంచి 15 మంది నదిలో పడిపోయారు. కొంతమంది పర్యాటకులు నదిలో మునిగిపోయినట్లు సమాచారం. కొంతమందిని స్థానికులు రక్షించారు.
ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎంత మంది కొట్టుకుపోయారే ఖచ్చితంగా తెలియదు. అధికారులు వివరాలు తెలపాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..