
ఈ మధ్యకాలంలో కులాంతర వివాహాలు చేసుకోవడం పెరుగుతున్నాయి. అయితే ఈ పెళ్లిల్లను కొంతమంది తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారు మరికొందరు ఒప్పుకోవడం లేదు. దీంతో వాళ్ల కొడుకు లేదా కూతురు దూరంగా వెళ్లిపోయి వివాహాలు చేసుకుంటున్న ఘటనలు కూడా ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ యువతి తాను ఇష్టపడ్డ యువకుడ్ని కులంతర వివాహం చేసుకోగా.. ఆమె అన్నయ్య వచ్చి సినీ ఫక్కిలో ఎత్తుకెళ్లడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే బిహార్‌లోని అరారియా జిల్లాలో రూప, ఛోటు కుమార్ ఠాకుర్‌లు గత కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.
అయితే వీరిద్దరి కులాలు వేరు కావడం వల్ల యువతి కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ ఆ యువతి మాత్రం అతడితోనే జీవితం పంచుకోవాలనుకుంది. ఇక చేసేదేం లేక కుటుంబసభ్యులను కాదని జూన్ 2న ఆమె కులాంతర వివాహం చేసుకుంది. ఈ విషయం తెలుసుకొని ఆగ్రహించిన యువతి సోదరుడు పెళ్లైన మరునాడే.. మరో వ్యక్తితో కలిసి వచ్చి అత్తారింట్లో నుంచి సోదరిని బలవంతంగా బైకుపై ఎత్తుకెళ్లాడు. అబ్బాయి కుటంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు యవతిని స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. రూప వాంగ్మూలం తీసుకొని.. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.