బ్రేకింగ్‌.. ఆస్పత్రిలో చేరిన సంజయ్‌ దత్‌

| Edited By:

Aug 08, 2020 | 11:51 PM

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో.. వెంటనే ఆయన్ను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో..

బ్రేకింగ్‌.. ఆస్పత్రిలో చేరిన సంజయ్‌ దత్‌
Follow us on

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో.. వెంటనే ఆయన్ను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. ముందస్తు జాగ్రత్తగా ఆయనకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులో నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కాగా, సంజయ్ దత్ తన అధికారిక ట్విట్టర్‌లో కూడా స్పందించారు. తనకు ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని.. కరోనా పరీక్షలు చేయగా.. నెగెటివ్‌ వచ్చిందని.. మరో రెండు మూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకుంటానని తెలిపారు.