Watch Video: వావ్.. రోడ్డుపై దూసుకెళ్తున్న వినూత్న కారు.. కుర్రాళ్ల ప్రతిభను మెచ్చుకోవాల్సిందే

స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత ఇంటర్నెట్‍లో వినూత్న వీడియోలకి కొదవే లేకుండా పోయింది. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు తమకున్న ప్రతిభను సోషల్ మీడియాలో పంచుకుంటూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కొందరైతే సొంతంగా యూట్యూబ్ ఛానళ్లు మొదలుపెట్టిసి అందులో కూడా బాగా సంపాదించుకుంటున్నారు.

Watch Video: వావ్.. రోడ్డుపై దూసుకెళ్తున్న వినూత్న కారు.. కుర్రాళ్ల ప్రతిభను మెచ్చుకోవాల్సిందే
Representive Photo

Updated on: Jul 29, 2023 | 2:19 PM

స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత ఇంటర్నెట్‍లో వినూత్న వీడియోలకి కొదవే లేకుండా పోయింది. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు తమకున్న ప్రతిభను సోషల్ మీడియాలో పంచుకుంటూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కొందరైతే సొంతంగా యూట్యూబ్ ఛానళ్లు మొదలుపెట్టిసి అందులో కూడా బాగా సంపాదించుకుంటున్నారు. మరికొందరు రీల్స్ చేస్తూ కూడా సంపాదిస్తున్నారు. తమకున్న నైపుణ్యాలను చూపిస్తూ నెటీజన్లను ఆకట్టుకుంటున్నారు. మరికొందరైతే ప్రాణాలకు తెగించి కూడా విన్యాసాలు చేస్తుంటారు. తమ అభిమానుల్ని మెప్పించేందుకు ఎంతటి సాహసానికైనా పాల్పడుతున్నారు క్రియేటర్స్. అయితే కొంతమంది పాత సామాన్లతోనే కార్లు, హెలికాప్టర్లు లాంటివి తయారు చేస్తూ ఔర అనిపిస్తున్నారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో దర్శనిమిస్తోంది. ఈ వీడియోను చూసినవాళ్లందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.

ఇందులో ఉన్న వీడియోను గమనిస్తే నాలుగు చక్రాలతో ఉన్న ఓ విచిత్ర వాహనం కనిపిస్తుంది. దానికి బైక్ ఇంజిన్, స్టీరింగ్‌లను కూడా అమర్చి ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇంట్లో పారేసిన పాత వస్తువులతోనే ఈ వాహనాన్ని తయారుచేసినట్లు కనిపిస్తుంది. నాలుగు పాతటైర్లు అమర్చి దానికి ఫినిషింగ్ కూడా బాగా చేశారు. ఇది చూస్తే ఏంటి ఇలా ఉంది అని నవ్వొస్తుంది. కానీ ఇది రోడ్డుపై దూసుకెళ్లడం చూస్తే మాత్రం కళ్లు ఆర్పకుండా చూడాల్సిందే. రోడ్డుపై వెళ్తున్న ఈ వాహనంలో నలుగురు అబ్బాయిలు ఉన్నారు. అందులో ఓ వ్యక్తి డ్రైవింగ్ చేస్తుండగా మిగతా ముగ్గురు అతని పక్కన కూర్చోని ఎంజాయ్ చేస్తున్నారు. అచ్చం ఓ కారు ఎలా నడుస్తుందో అలాగే ఈ వాహనం కూడా రోడ్డుపై దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటీజన్లు ఆ కుర్రాళ్ల ప్రతిభకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలామంది విభిన్న రీతిలో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోను చూసేయ్యండి. వావ్ అనకుండా ఉండలేరు.

ఇవి కూడా చదవండి