Bombay high court: ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్‌సింగ్‌కు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై రూ. 100 కోట్ల వసూళ్ల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న పరమ్‌బీర్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. హోంమంత్రిపై వసూళ్ల ఆరోపణలు రావడంతో.. అత్యున్నత పదవిలో ఉండి కూడా ఎఫ్‌ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదని హైకోర్టు పరమ్‌బీర్ సింగ్‌ను ప్రశ్నించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా హైకోర్టులో ఎందుకు పిటిషన్ వేశారని నిలదీసింది. పోలీసు స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టిన తరువాతే ఇక్కడికి రావాలని పరమ్‌బీర్‌సింగ్‌ను ముంబై హైకోర్టు సూచించింది.
మీపై ఉన్నతాధికారి అక్రమాలకు పాల్పడుతున్నప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని కూడా పరమ్‌బీర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ లేకుండా తాము ఎలాంటి దర్యాప్తుకు ఆదేశించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అంబానీ బెదిరింపుల కేసులో అరెస్టయిన మాజీ పోలీసు అధికారి సచిన్‌వాజేతో హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌కు సన్నిహిత సంబంధాలున్నట్టు ఆరోపించారు పరమ్‌బీర్. ముంబైలో బార్లు, పబ్‌ల నుంచి నెలకు 100 కోట్లు వసూలు చేయాలని వాజేకు దేశ్‌ముఖ్ టార్గెట్ పెట్టారని కూడా ఆరోపించారు.
Read Also….. MPDO Subhash Goud Bribe : రూ. రెండు లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన పరిగి ఎంపీడీవో, అతని సిబ్బంది