Urmila matondkar: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో వాహనదారుల నుంచే కాకుండా నటీనటులు, రాజకీయ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో పెట్రోల్ ధరలు సెంచరీ దాటి పరుగులు తీస్తుంటే నటీ, శివసేన నేత ఊర్మిళ మటోండ్కర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పెట్రోల్ మంటల నేపథ్యంలో పాత పాట ‘ఇక్కడ్ బక్కడ్ బాంబేబో’ను ప్రస్తావిస్తూ ఊర్మిళ ట్వీట్ చేశారు.
పెట్రోల్ ధరలు గురువారం వరుసగా పదో రోజు ఎగబాకాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో వంద రూపాయలు మార్క్‌ను దాటింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ కు రూ.89.88కి చేరగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రల్ లీటర్‌కు రూ.96.32కు చేరింది. గురువారం పెట్రోల్, లీటర్‌కు 34 పైసల మేర పెరుగగా, డీజిల్ లీటర్‌పై 32 పైసలు పెరిగింది.
अक्कड़ बक्कड़ बंबे बो
डीजल नब्बे पेट्रोल सौ
सौ मे लगा धागा
सिलेंडर ऊछल के भागा ??— Urmila Matondkar (@UrmilaMatondkar) February 18, 2021