BRO Recruitment 2021: బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌ (BRO)లో 459 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. దరఖాస్తు చేసుకోండిలా..

|

Feb 19, 2021 | 4:25 PM

BRO Recruitment 2021: బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌ (BRO)లో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారి శుభవార్త. బీఆర్‌వోలో వివిధ పోస్టుల కోసం 459 ఖాళీలను భర్తీకి ..

BRO Recruitment 2021: బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌ (BRO)లో 459 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. దరఖాస్తు చేసుకోండిలా..
Follow us on

BRO Recruitment 2021: బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌ (BRO)లో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారి శుభవార్త. బీఆర్‌వోలో వివిధ పోస్టుల కోసం 459 ఖాళీలను భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది భారత రక్షణ మంత్రిత్వశాఖ. ఈ నోటిఫికేషన్‌నలు ఫిబ్రవరి 18న జారీ చేసింది. ఇందులో కార్టోగ్రాఫర్‌, స్టోర్‌ సూపర్‌ వైజర్‌, రేడియో మెకానిక్‌, ప్రయోగశాల సహాయకుడు, మల్టీ-స్కిల్డ్‌ వర్కర్‌, టెక్నికల్‌ పోస్టులు ఉన్నాయి.

పోస్టులు:

డ్రాఫ్ట్స్‌మన్‌ -43
సూపర్‌ వైజర్‌ – 11
రేడియో మెకానిక్‌ -4
ల్యాబ్‌ అసిస్టెంట్‌ -1
మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌ (మాసన్‌)-100
మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌ (డ్రైవర్‌ ఇంజిన్‌ స్టాటిక్‌) – 150
స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌ -150

ఎలా దరఖాస్తు చేసుకోవాలి

బీఆర్‌ఓ రిక్రూట్‌మెంట్‌ 2021 కింద ప్రకటించిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌ సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి. ప్రకటన వెలువడిన 45 రోజుల్లోపు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్‌ 14,2021. ఈ పోస్టులు మహారాష్ట్రలోని పుణేలో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో కలవు. జీఆర్‌ఇఎఫ్‌ సెంటర్‌, డిఘిక్యాంప్‌, పూణే-411015కు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ – 2021 ఏప్రిల్‌ 14

వయో పరిమితి – 18 నుంచి 25 సంవత్సరాలు
ఇతర పోస్టులకు – 18 నుంచి 27 సంవత్సరాలు
ఎంపిక – ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, రాత పరీక్షల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
అర్హత : ఇంటర్మీడియేట్, లేదా గ్రాడ్యూయేట్‌