ఇండియాలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం నాటికి 11,717 కేసులు నమోదు కాగా గుజరాత్ లో అత్యధికంగా 2,859, ఆ తరువాత మహారాష్ట్రలో 2,770, ఏపీలో 768 కేసులు నమోదైనట్టు కేంద్ర మంత్రి సదానంద గౌడ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ వ్యాధి చికిత్సలో వాడే యాంఫోటెరిసిన్-బీ మందు 29,250 వైల్స్ఉన్నాయని అయన తెలిపారు. రోగుల సంఖ్యను బట్టి ఆయా రాష్ట్రాలకు ఈ మెడిసిన్ ని పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు. వివిధ రాష్టాల్లో కోవిద్ నుంచి కోలుకున్న రోగుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు బయల్పడుతున్నాయి. ఢిల్లీలో 620 కేసులు ఉన్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించగా.. కాదని 119 కేసులని మంత్రి సదానంద గౌడ స్పష్టం చేశారు. కేంద్రం మొదట దీన్ని అంటువ్యాధిగా నోటిఫై చేయగా,, 11 రాష్ట్రాలు కూడా ఇదే విధంగా ప్రకటించాయి. కాగా ఈ వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చు లక్షల్లోనే ఉంటుందని అంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దీని ట్రీట్ మెంట్ కి 5 లక్షలు అవుతుందని, కానీ ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ లో 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. పేద కుటుంబాలు ఇన్ని లక్షలను ఎక్కడి నుంచి తెస్తాయని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పైగా ప్రైవేటు హాస్పిటల్స్ లో డిశ్చార్జ్ ట్రీట్ మెంట్ కి అదనంగా చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్పుడిప్పుడే కోవిద్ కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరగడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. దీనికి ప్రత్యేక చికిత్స కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని పేరు పొందిన ఆస్పత్రులతో బాటు ప్రభుత్వ ఆస్పత్రులలో కూడా ఇందుకు అదనపు సౌకర్యాలు ఉండడం కొంతలో కొంత నయ
మరిన్ని వీడియోలు చూడండి ఇక్కడ : Cyclone Yaas Live Video : అల్లకల్లోలంగా సముద్రతీరం..అతి తీవ్రమైన తుఫానుగా మారిన యాస్ సైక్లోన్..!(వీడియో).
Corona Virus: 100 మంది బౌద్ధ సన్యాసులకు కరోనా పాజిటివ్… చిన్న రాష్ట్రమైన సిక్కింలో కేసుల పెరుగుదల.. ( వీడియో )
Viral Video: వినూత్నంగా ఆకాశం లో ఎగురుతూ పెళ్లి… ఆతర్వాత ఏమైందో తెలిసి షాక్ లో కుటుంబ సభ్యులు.. ( వీడియో )