ఓ వైపు కర్ణాటక రాజకీయ సంక్షోభం.. సంకీర్ణ కూటమిని వేధిస్తుండగా.. బీజేపీ నేతలు మాత్రం జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు.
ఈ నెల 18న కాంగ్రెస్, జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలనిరూపణ చేసుకొనుంది. ఈ తరుణంలో యడ్యూరప్ప సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. బెంగళూరులోని రమదా హోటల్ ప్రాంగంణంలో తమ ఎమ్మెల్యేలతో కలిసి క్రికెట్ ఆడటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.