బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకా నాలుగైదు నెలల సమయం ఉండగానే అప్పుడే రాష్ట్రంలో ఎలెక్షన్ వాతావరణంవేడెక్కుతోంది. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించగానే ఈమె మాజీ సహచరుడు , మాజీ మంత్రి సువెందు అధికారిని ఈ నియోజకవర్గం నుంచి పోటీకి నిలబెడతామని బీజేపీ ప్రకటించింది. ఒకప్పుడు తృణమూల్ లో ఉన్న సువెందు అధికారి ఆ మధ్య బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.. నందిగ్రామ్ లో మమతను తాను 50 వేల ఓట్ల ఆధిక్యంతో ఓడిస్తానని, అలా చేయలేకపోతే రాజకీయాల నుంచి వైదొలగుతానని అధికారి ఇటీవల సవాల్ చేశారు. దీన్ని బీజేపీ కూడా సీరియస్ గా తీసుకుంది. అవసరమైతే నేను కోల్ కతా లో ఇదివరకు పోటీచేసి గెలిచిన నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తానని, కానీ తన ప్రధాన లక్ష్యం నందిగ్రామ్ నియోజకవర్గమేనని మమత అన్నారు. దీనిపై స్పందించిన సువెందు.. అధికారి….ఏదో ఒక చోట తన ఓటమి ఖాయమన్నట్టు ఆమె మాట్లాడుతున్నారని, అసలు మొదట నందిగ్రామ్ గురించి మాట్లాడాలని అన్నారు.
Kgf chapter 2 climax : కేజీఎఫ్ క్లైమాక్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే షాక్ అవుతారు..
BJP Fires on AP DGP: తీవ్ర దుమారం రేపుతున్న ఏపీ డీజీపీ వ్యాఖ్యలు.. బీజేపీ కార్యాచరణపై ఉత్కంఠ..