BJP: నాలువైపుల నుంచి సెక్రటేరియట్‌‌ను ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు.. విపక్ష నేత సువేందు అధికారి అరెస్ట్‌

|

Sep 13, 2022 | 1:33 PM

BJP Nabanna Abhiyan: బెంగాల్‌లో అరాచకం రాజ్యమేలుతోందని విమర్శించార సువేందు అధికారి. తృణమూల్‌ సర్కార్‌ భారీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు బీజేపీ నేతలు . బెంగాల్‌ నార్త్‌ కొరియా లాగా..

BJP: నాలువైపుల నుంచి సెక్రటేరియట్‌‌ను ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు.. విపక్ష నేత సువేందు అధికారి అరెస్ట్‌
Bjp Nabanna Abhiyan
Follow us on

బెంగాల్‌లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మమత సర్కార్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈస్ట్‌ మిడ్నాపూర్‌లో బీజేపీ -తృణమూల్‌ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు చెలరేగాయి రెండు పార్టీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘర్షణలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కోల్‌కతాలో సెక్రటేరియట్‌ ముట్టడికి పిలుపునిచ్చింది బీజేపీ. నాలుగు వైపుల నుంచి బీజేపీ కార్యకర్తలు దూసుకురావడంతో కోల్‌కతాలో పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారిని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.

కోల్‌కతా వైపు రావడానికి అనుమతించలేదని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. అనంతరం బీజేపీ కార్యకర్తలు- మద్దతుదారులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. కార్మికులు-మద్దతుదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కార్యకర్తల మద్దతుదారులు వీధుల్లో కూర్చుని ప్రదర్శనలు కొనసాగించారు. వీధుల్లో టైర్లు తగులబెట్టి నిరసనలు ప్రారంభించారు.

బెంగాల్‌లో అరాచకం రాజ్యమేలుతోందని విమర్శించార సువేందు అధికారి. తృణమూల్‌ సర్కార్‌ భారీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు బీజేపీ నేతలు . బెంగాల్‌ నార్త్‌ కొరియా లాగా తయారయ్యిందన్నారు.

ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోల్‌కతాలో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. నబానా మార్చ్‌ పేరుతో బీజేపీ ర్యాలీని చేపట్టింది. ఈ నిరసనల కారణంగా హౌరా బ్రిడ్జి దగ్గర భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం