ఏడాదిలో ఐదుగురు కీలక నేతలు.. బీజేపీకి పెద్ద దెబ్బే

| Edited By:

Aug 24, 2019 | 6:20 PM

అనారోగ్య సమస్యలతో గత కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్న కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్‌ జైట్లీ ఈ ఉదయం కన్నుమూశారు. దీంతో బీజేపీ మరో కీలక నేతను కోల్పోయింది. అయితే ఏడాది వ్యవధిలో ఇదే పార్టీకి చెందిన ఐదుగురు కీలక నేతలు మృతి చెందారు. బీజేపీ స్థాపితమైన తొలి నాళ్ల నుంచి ప్రముఖంగా వ్యవహరిస్తున్న వీరి మరణం బీజేపీకి పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఇక వారిలో ఇద్దరు పదవిలో ఉండగానే తమ […]

ఏడాదిలో ఐదుగురు కీలక నేతలు.. బీజేపీకి పెద్ద దెబ్బే
Follow us on

అనారోగ్య సమస్యలతో గత కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్న కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్‌ జైట్లీ ఈ ఉదయం కన్నుమూశారు. దీంతో బీజేపీ మరో కీలక నేతను కోల్పోయింది. అయితే ఏడాది వ్యవధిలో ఇదే పార్టీకి చెందిన ఐదుగురు కీలక నేతలు మృతి చెందారు. బీజేపీ స్థాపితమైన తొలి నాళ్ల నుంచి ప్రముఖంగా వ్యవహరిస్తున్న వీరి మరణం బీజేపీకి పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఇక వారిలో ఇద్దరు పదవిలో ఉండగానే తమ తనువును చాలించారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి:
భారత మాజీ ప్రధాని, బీజేపీ తొలి అధ్యక్షుడు వాజ్‌పేయి గత ఏడాది ఇదే నెలలో కన్నుమూశారు. తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దాదాపుగా తొమ్మిది వారాల పాటు మృత్యువుతో పోరాడుతూ ఆగష్టు 16న తుది శ్వాస విడిచారు.

అనంత్ కుమార్:
ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడిన అనంత్ కుమార్ గత ఏడాది నవంబర్ 12న మృతి చెందారు. ఆ సమయంలో ఆయన కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు. అంతేకాదు బీజేపీలో కీలక నేతగా పనిచేశారు.

మనోహర్ పారికర్:
ఆర్ఎస్ఆర్ ప్రచారక్ నుంచి కేంద్ర రక్షణ మంత్రిగా, ఆ తరువాత గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మనోహర్ పారికర్ ఈ ఏడాది మార్చి 17న దివికేగారు. అరుదైన క్యాన్సర్‌ బారిన పడ్డ ఆయన కొన్ని నెలలుగా మృత్యువుతో పోరాడుతూ తనువు చాలించారు. పాక్‌ ఉగ్రసంస్థలపై భారత ప్రభుత్వం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌లో ఆయన కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

సుష్మా స్వరాజ్:
ఎన్నో సేవలు చేసిన చిన్నమ్మగా పేరొందిన కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ నెల ప్రారంభంలో చివరి శ్వాసను విడిచారు. ఆకస్మిక గుండెపోటుతో సుష్మా ఆగష్టు 6న కన్నుమూశారు. ఆమె మరణం ఎంతోమందిని కలిచివేసిన విషయం తెలిసిందే.