జమ్మూ కాశ్మీర్ లోని గందెర్ బల్ జిల్లాలో మంగళవారం సాయంత్రం గులాం ఖాదిర్ అనే బీజేపీ నేతపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే ఖాదిర్ సెక్యూరిటీ గార్డులు తిరిగి వారిపై కాల్పులు జరపడంతోఆయన గాయపడకుండా తప్పించుకున్నారు. గార్డుల ఫైరింగ్ లో ఓ టెర్రరిస్ట్ మరణించాడు. ఈ ఘటనతో ఈ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వివరాలు తెలియవలసి ఉంది.