Biological E’s Vaccine: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 30 కోట్ల వ్యాక్సిన్ల సరఫరాకు బయోలాజీకల్‌-ఈతో ఒప్పందం

Biological E's Vaccine: దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. టీకా పంపిణీ వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది..

Biological Es Vaccine: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 30 కోట్ల వ్యాక్సిన్ల సరఫరాకు బయోలాజీకల్‌-ఈతో ఒప్పందం
Biological E's Vaccine

Updated on: Jun 03, 2021 | 11:44 AM

Biological E’s Vaccine: దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. టీకా పంపిణీ వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అయితే హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఈ ఫార్మా కంపెనీతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీకి 30 కోట్ల డోసులు ఆర్డర్‌ ఇచ్చి రూ.1500 కోట్లు ముందస్తుగా చెల్లింపులు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఆగస్టు నుంచి డిసెంబర్‌ వరకు బయోలాజికల్‌-ఈ టీకాలు తయారు చేసి నిల్వ చేస్తుందని పేర్కొంది.

ఈ బయోలాజికల్‌-ఈ తయారు చేస్తున్న వ్యాక్సిన్‌ ఒకటి, రెండో దశ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయని, ప్రస్తుతం ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది. ఆర్‌బీడీ ప్రోటీన్‌ సబ్‌ యూనిట్‌ వ్యా్క్సిన్‌ను కంపెనీ తయారు చేసిందని రాబోయే కొద్ది నెలల్లో అందుబాటులోకి రానుందని తెలిపింది.

ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లతో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్లకు అనుమతి లభించగా.. పంపిణీ కొనసాగుతోంది. జూలై నాటికి రోజుకు కోటి మోతాదులను పంపిణీ చేయాలని భావిస్తున్న కేంద్రం ఈ మేరకు విదేశీ టీకా కంపెనీలైన ఫైజర్‌, మోడెర్నాతో సైతం చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.

ఇవీ కూడా చదవండి:

Corona Cases India: దేశంలో కొత్తగా మరో 1.34 లక్షల పాజిటివ్ కేసులు, 2887 మరణాలు..

Reliance Industries: కోవిడ్‌తో మరణించిన ఉద్యోగి కుటుంబానికి ఐదేళ్ల పాటు వేతనం.. రిలయన్స్‌ కీలక నిర్ణయం

Follow Us